Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Diseases: ఇంత కాలం ఎండలు దంచికొట్టాయి.. వర్షాల సీజన్ ప్రారంభమైనా.. ఇక పూర్తిస్థాయిలో వర్షాలు కురవడం లేదు.. అయితే, వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, అనేక అంటువ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. వర్షాల కారణంగా నిల్వ నీరు, అధిక తేమ, నీటి కాలుష్యం పెరగడంతో దోమలు, బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం, వర్షాకాలంలో ప్రధానంగా డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, లెప్టోస్పిరోసిస్, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్-ఏ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని చెబుతున్నారు..
Also Read
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
- Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
డెంగీ
నిల్వ నీటిలో పెరిగే ఏడిస్ దోమల ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు దీని ప్రధాన లక్షణాలు. దోమల పెరుగుదలను అరికట్టడం, దోమతెరలు, రిపెల్లెంట్లు ఉపయోగించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
మలేరియా
అనోఫిలిస్ దోమల ద్వారా వ్యాపించే మలేరియాలో చలి వణుకుతో కూడిన జ్వరం, అలసట, రక్తహీనత కనిపిస్తాయి. నిల్వ నీరు తొలగించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం అవసరం.
చికున్‌గున్యా
ఏడిస్ దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధిలో తీవ్రమైన కీళ్ల నొప్పులు, జ్వరం, వాపులు వారాల తరబడి కొనసాగవచ్చు.
లెప్టోస్పిరోసిస్
వరద నీరు లేదా జంతువుల మూత్రంతో కలుషితమైన నీటి ద్వారా వ్యాపించే ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ శరీరంలోని చిన్న గాయాల ద్వారా ప్రవేశిస్తుంది. అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి దీని లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
టైఫాయిడ్
కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపించే టైఫాయిడ్‌లో దీర్ఘకాలిక జ్వరం, కడుపునొప్పి, బలహీనత, తలనొప్పి కనిపిస్తాయి. పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు తీసుకోవడం అత్యంత ముఖ్యం.
కలరా
కలుషిత నీటి ద్వారా వ్యాపించే కలరా వల్ల తీవ్రమైన విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సంభవించవచ్చు. సురక్షితమైన తాగునీరు తీసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు.
హెపటైటిస్-ఏ
కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కామెర్లు, అలసట, వికారం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వర్షాకాలంలో ఎలా జాగ్రత్తపడాలి?
వర్షాకాలంలో నిల్వ నీటిని తొలగించడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం, మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగడం, ఆహార పరిశుభ్రత పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. జ్వరం, విరేచనాలు లేదా ఇతర లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..