Vastu Tips: ఇంట్లో కుబేర స్థానం ఏది? లాకర్‌ను ఏ దిశలో ఉంచితే ధనయోగం కలుగుతుంది.?

  • వాస్తు శాస్త్రంలో ‘‘కుబేర స్థానానికి’’ ప్రాముఖ్యత..
  • ఇంట్లో ఉత్తర దిశలో కుబేర స్థానం..
Vastu Tips

Vastu Tips

Vastu Tips: భారతదేశంలో ఇళ్ల నిర్మాణానికి చాలా మంది వాస్తును పాటిస్తుంటారు. సరైన వాస్తుతో, ఎలాంటి దోషం లేకుండా ఇళ్లు నిర్మించుకుంటే, అందులో నివసించే కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉండవని చెబుతుంటారు. ముఖ్యంగా, ఇంటిలో ‘‘కుబేర స్థానం’’కి చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు. సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానం బాగుంటే, ఇంట్లో సంపదకు లోటు ఉండదని భావిస్తారు.

కుబేర మూలకు చాలా ప్రాధాన్యత..

ఇంటిలో ‘‘ఉత్తర భాగాన్ని’’ కుబేర మూలగా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్త లేదా బరువైన వస్తువులు ఉంచకూడదని చెబుతారు. కుబేర మూలలో ఆటంకాలు ఏర్పడితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీకి ఆటంకం ఏర్పడుతుంది. ఈ ప్రదేశాన్ని విశాలంగా, శుభ్రంగా ఉంచడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు.

లాకర్లు ఇలా పెట్టుకోంది..

డబ్బుకు సంబంధించిన పత్రాలు, సేఫ్‌లు, లాకర్లు ఇంటి నైరుతి మూలలో, ఉత్తర దిశకు అభిముఖంగా ఉంచడం వల్ల శుభాలు కలుగుతాయి. ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని ఉంచడం కూడా చాలా మంచిది. ఇది ఆర్థిక స్థిరత్వానికి హెల్ప్ అవుతుందని చెబుతుంటారు.

ఈ వస్తువులు ఉంచితే శుభం..

వాస్తు ప్రకారం, ఉత్తర దిశలో నీలం, ఆకుపచ్చ, ఊదా రంగులలో ఉండే చిన్న ఫౌంటెన్లు, అక్వేరియంలు, అద్దాలు, అలంకరణ వస్తువులు ఉంచితే శుభప్రదమని భావిస్తారు. ఇంటి వాతావరణంలో సమతుల్యత, తాజాదనాన్ని కాపాడటమే దీని ఉద్దేశం.