Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks: కిచెన్‌లో ప్రతిరోజూ వాడే వస్తువుల్లో గ్యాస్ స్టవ్‌కు ఉండే ప్రాముఖ్యత వేరు. వంట చేసేటప్పుడు పాలు పొంగడం, కూరల జిడ్డు, నూనె మరకలు పడటం వల్ల గ్యాస్ బర్నర్లు, ఐరన్ స్టాండ్లు నల్లగా, మొండి జిడ్డుతో నిండిపోతాయి. బర్నర్ రంధ్రాలు పూడుకుపోవడం వల్ల మంట ఎరుపు రంగులో వస్తుంది. దీనివల్ల గ్యాస్ ఎక్కువ వృథా అవ్వడమే కాకుండా గిన్నెలు కూడా నల్లగా అయిపోతాయి. ఈ సమస్యలను మీరు కూడా ఫేస్ చేశారా.. అయితే మార్కెట్లో దొరికే కెమికల్స్ వాడకుండా.. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే కేవలం కొన్ని నిమిషాల్లో నల్లగా, మొండి జిడ్డుతో తప్పు పట్టిన గ్యాస్ స్టాండ్లు, బర్నర్లను మెరిపించే అవకాశం ఉందని మీకు తెలుసా.. అది ఎలాగో ఈ స్టోరీలోత తెలుసుకుందాం.
బర్నర్ల కోసం ‘ఈనో – నిమ్మరసం’ మ్యాజిక్
రాగి లేదా ఇత్తడితో చేసే గ్యాస్ బర్నర్ల మొండి మరకలను వదిలించడానికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ముందుగా ఒక చిన్న గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి. అందులో ఒక ప్యాకెట్ ‘ఈనో’ (Eno) పౌడర్, ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఇప్పుడు నల్లగా మారిన బర్నర్లను ఆ నీటిలో వేసి కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నాననివ్వండి. తర్వాత వాటిని బయటకు తీసి, పాత టూత్ బ్రష్‌పై కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ లేదా సర్ఫ్ వేసి రుద్దితే.. బర్నర్ లోపల ఉన్న జిడ్డు, రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి మొత్తం వదిలిపోయి కొత్త వాటిలా మెరిసిపోతాయి.
Also Read
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
- Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్‌ల క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
ఐరన్ స్టాండ్ల మొండి జిడ్డుకు ‘బేకింగ్ సోడా – వెనిగర్’
గ్యాస్ స్టవ్ పైన గిన్నెలు పెట్టే ఐరన్ స్టాండ్లకు పట్టే నూనె జిడ్డు అంత సులభంగా వదలదు. దీనికోసం ఈ చిట్కా ట్రై చేస్తే అవి కొత్త వాటిలా మెరిసిపోతాయని చెబుతున్నారు. ‘బేకింగ్ సోడా – వెనిగర్’ను తయారు చేసే విధానం.. ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో బాగా మరిగిన వేడి నీటిని తీసుకోవాలి. అందులో అర కప్పు వెనిగర్ (Vinegar), రెండు పెద్ద చెంచాల బేకింగ్ సోడా (వంటసోడా) వేయాలి. తర్వాత ఈ నీటిలో తప్పు పట్టిన గ్యాస్ స్టాండ్లను మునిగేలా ఉంచి అర్ధగంట పాటు వదిలేయండి. వేడి నీరు – వెనిగర్ కారణంగా జిడ్డు మొత్తం వదిలిపోతుంది. ఆ తర్వాత స్టీల్ స్క్రబ్బర్ (స్టీల్ పీచు) సహాయంతో కొద్దిగా సోప్ పెట్టి గట్టిగా రుద్దితే.. ఎంతటి మొండి జిడ్డు అయినా ఇట్టే వదిలిపోయి స్టాండ్లు కొత్త వాటిలా మెరుస్తాయని చెబుతున్నారు.
పూడుకుపోయిన రంధ్రాల కోసం ‘వెనిగర్ – బేకింగ్ సోడా’ పేస్ట్
కొన్నిసార్లు బర్నర్ రంధ్రాలలో అన్నం మెతుకులు లేదా కూరల ముక్కలు ఇరుక్కుపోయి సగం మంట మాత్రమే వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొద్దిగా బేకింగ్ సోడాలో వెనిగర్ కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను బర్నర్ల పైన, రంధ్రాల పైన బాగా రాయండి. ఒక 15 నిమిషాల తర్వాత ఒక సన్నటి పిన్ లేదా సూది తీసుకుని బర్నర్ రంధ్రాలను క్లీన్ చేయండి. ఆ తర్వాత నీటితో కడిగేస్తే రంధ్రాలన్నీ క్లియర్ అయి, కొత్త వాటిలా తయారు అవుతాయి. ఈ చిట్కాలు పాటించిన తర్వాత బర్నర్లు మరియు స్టాండ్లను తడి లేకుండా పొడి గుడ్డతో బాగా తుడవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాతే వాటిని గ్యాస్ స్టవ్‌పై అమర్చాలి. తడి ఉంటే మంట సరిగ్గా రాదు. కనీసం వారానికి లేదా పది రోజులకు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే.. గ్యాస్ 20% వరకు ఆదా అవుతుంది, స్టవ్ కూడా ఎప్పుడూ కొత్తదానిలా మెరుస్తూ ఉంటుంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?