Egg Storage Tips in Summer: వేసవిలో గుడ్లు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి..? తినే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egg Storage Tips in Summer: వేసవి కాలంలో ఆహార పదార్థాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా గుడ్ల వంటి సున్నితమైన ఆహార పదార్థాలను సరైన విధంగా నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడై ఆరోగ్యానికి ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. చాలామంది మార్కెట్ నుంచి గుడ్లు కొనుగోలు చేసి వంటగదిలో బయటే ఉంచేస్తుంటారు. అయితే మండుటెండల్లో ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు గుడ్లు చాలా వేగంగా పాడవుతాయి. ముఖ్యంగా గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేడి కారణంగా గుడ్ల లోపల తేమ పెరిగి, సూక్ష్మజీవులు సులభంగా ప్రవేశించి వాటిని తినడానికి పనికిరాకుండా చేస్తాయి.
గుడ్లను ఎక్కడ నిల్వ చేయాలి..?
* అమెరికా వ్యవసాయ శాఖ (USDA) మార్గదర్శకాల ప్రకారం, గుడ్లను ఒకసారి ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత వాటిని రెండు గంటలకంటే ఎక్కువసేపు బయట ఉంచకూడదు.
Also Read
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
* వేసవిలో బయట ఉంచిన గుడ్లు కేవలం రెండు నుంచి మూడు రోజుల్లోనే పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే గుడ్లను కొనుగోలు చేసిన వెంటనే చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి.
* వేసవిలో గుడ్లను బయట ఉంచడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదం “సాల్మొనెల్లా” అనే బ్యాక్టీరియా పెరగడం. ఈ బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు ప్రధాన కారణంగా భావిస్తారు. దీని వల్ల వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం వంటి సమస్యలు రావచ్చు.
* చల్లని వాతావరణంలో నిష్క్రియంగా ఉండే ఈ బ్యాక్టీరియా, అధిక వేడి కారణంగా వేగంగా విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* గుడ్లను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఉత్తమ మార్గం.
* 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలో పచ్చి గుడ్లు 3 నుంచి 5 వారాల వరకు తాజాగా ఉంటాయి.
* ఉడకబెట్టిన గుడ్లు అయితే, పెంకుతో సహా ఫ్రిజ్‌లో ఉంచితే సుమారు 7 రోజుల వరకు సురక్షితంగా ఉంటాయి.
అందువల్ల వేసవిలో గుడ్ల నిల్వ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, సరైన ఉష్ణోగ్రతలో భద్రపరిచి మాత్రమే వినియోగించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!