Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homemade Rose Water: ఈ రోజుల్లో చాలా మంది చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో రోజ్ వాటర్ (గులాబీ నీరు)కు ప్రత్యేక స్థానం ఉంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు చల్లదనాన్ని అందించడానికి, ముఖానికి సహజమైన కాంతిని తీసుకురావడానికి రోజ్ వాటర్‌ను చాలామంది ఉపయోగిస్తుంటారు. అయితే ఈ రోజ్ వాటర్‌ను మార్కెట్లో కొనుగోలు చేయడానికి బదులుగా ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* తాజా గులాబీ రేకులు – 2 నుంచి 3 కప్పులు
Also Read
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
* శుభ్రమైన నీరు – 2 నుంచి 3 కప్పులు
తయారీ విధానం..
ముందుగా గులాబీ రేకులను నీటితో శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో రేకులు పూర్తిగా మునిగేంత నీటిని పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నీటిని ఎక్కువగా మరిగించకుండా నెమ్మదిగా వేడి చేయాలి. కొద్దిసేపటికి గులాబీ రేకుల రంగు, సువాసన నీటిలోకి వస్తాయి. రేకులు రంగును పూర్తిగా వదిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నీటిని వడకట్టి పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన గాజు సీసా లేదా స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో భద్రపరచుకోవచ్చు. దీన్ని ఫేస్ టోనర్ లేదా ఫేస్ మిస్ట్‌గా ఉపయోగించవచ్చు.
మరో పద్ధతిలో మరింత స్వచ్ఛంగా..
గులాబీ రేకులను కడిగి గిన్నెలో వేసి అవి మునిగేంత నీటిని పోయాలి. గిన్నెను మీడియం మంటపై ఉంచి నీరు వేడెక్కుతున్న సమయంలో దానిపై మూతను తలకిందులుగా పెట్టాలి. ఆ మూతపై కొన్ని ఐస్ ముక్కలను ఉంచాలి. గిన్నెలో ఏర్పడే ఆవిరి చల్లటి మూతను తాకడంతో నీటి బిందువులుగా మారి కిందికి చేరుతుంది. ఇలా సేకరించిన నీటినే రోజ్ వాటర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారైన రోజ్ వాటర్‌ను వడకట్టి శుభ్రమైన బాటిల్లో నింపి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజువారీ స్కిన్ కేర్‌లో భాగంగా ఉపయోగించడం ద్వారా ముఖానికి ఫ్రెష్ లుక్ రావడానికి, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ముఖానికి పూర్తిగా ఉపయోగించే ముందు చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!