Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..

  • కొన్ని వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదం..
  • పాడవడంతో పాటు పోషక విలువలు తగ్గే ఛాన్స్..
Kitchen Tips

Kitchen Tips

Kitchen Tips: వేసవి వచ్చిందటే చాలా, మన ఇళ్లలోని ఫ్రిజ్‌లు వస్తువులతో నిండిపోతాయి. అవసరం ఉన్నా, లేకున్నా ఫ్రిజ్‌లో ఖాళీ ప్లేస్ ఉంటే చాలు వాటిని అందులో పెట్టేస్తాము. అయితే, కొన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచితే, అవి తాజాగా ఉండటానికి బదులుగా చెడిపోయే ప్రమాదం ఉందని, ఆరోగ్యానికి హాని కలిగించే విషంగా మారుతాయి.

బంగాళదుంపలు:

రిఫ్రిజిరేటర్‌లోని చల్లని గాలి బంగాళాదుంపలలోని పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది. దీనివల్ల బంగాళాదుంపలకు విచిత్రమైన తీపి రుచి వస్తుంది మరియు వండినప్పుడు వాటి రంగు ముదురుగా మారుతుంది. బంగాళాదుంపలను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో కాకుండా, ఒక బుట్టలో పెట్టి, చీకటిగా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయండి.

×
×
Ad

వెల్లుల్లి-ఉల్లిపాయలు:

వెల్లుల్లి-ఉల్లిపయాల్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేయకూడదు. ఫ్రిజ్‌లోని తేమ వల్ల ఉల్లిపాయాలు మెత్తగా మారి, బూజు పట్టడానికి కారణమవుతుంది. వెల్లుల్లి ఫ్రిజ్‌లో ఉంచితే మొలకెత్తి, రబ్బరులా గట్టిగా తయారవుతుంది. వీటి వల్ల ఫ్రిజ్‌లో వాసన వస్తుంది.

టమోటోలు:

టమోటోలను కూడా ఫ్రిజ్‌లో పెట్టవద్దు. కూలింగ్ వల్ల టమోటోల పై పొర దెబ్బతింటుంది. మెత్తాగా మారి, వాటి అసలైన రుచి కోల్పోతాయి.

తేనె:

తేనె బయట ఉంచితే పాడవుతుందనే అపోహ ఉంటుంది. దీంతో ప్రజలు దీనిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. తేనె వందల ఏళ్ల పాటు పాడవని ఆమారం. దీనిని ఫ్రిజ్‌లో ఉంచితే చిన్న స్పటికాలుగా మారి, చిక్కగా, గట్టిగా తయారవుతుంది.

చపాతీ:

చపాతీ వంటి వాటిని కూడా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దీని వల్ల అవి ఆరిపోతాయి. గట్టిగా మారి తినేందుకు కష్టంగా ఉంటాయి.

కాఫీ పొడి:

కాఫీ పొడిని లేదా గింజలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచొద్దు. అవి స్పాంజిలా చుట్టుపక్కల ఉన్న ఆహార పదార్థాల నుండి తేమను, వాసనలను పీల్చుకుంటాయి. దీని వల్ల అవి వాటి రుచిని, వాసనను కోల్పోతుంది.

అరటి పండ్లు, పుచ్చకాయ:

అరటిపండ్లను ఎప్పుడూ వేడి వాతావరణంలో ఉంచడం మంచింది. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే వాటి తొక్కలు నల్లగా మారుతాయి. ఫ్రిజ్‌లోని చల్లదనం తొక్కలోని కణాలను దెబ్బతీస్తుంది. పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఇలా చేస్తేనే దీని లోని యాంటీఆక్సిడెంట్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. అయితే, కోసిన తర్వాత ముక్కల్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.