Cooking Hacks: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇల్లాళ్లకు వంటగదితోనే సగం రోజు సరిపోతుంది. ఎంత వేగంగా చేద్దామన్నా.. పాలు పొంగిపోవడం, ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రావడం, వెల్లుల్లి పొట్టు తీయడానికి గోళ్లు నొప్పి పెట్టడం వంటి చిన్న చిన్న సమస్యలు వారికి నిత్యం విసుగు తెప్పిస్తుంటాయి. వంటింట్లో రోజూ పనులు చేయడం ఒక ఎత్తైతే, అక్కడ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను మేనేజ్ చేయడం మరో ఎత్తు. అయితే కిచెన్‌లో గంటల తరబడి పడాల్సిన కష్టాన్ని కేవలం నిమిషాల్లో ముగించే కొన్ని స్మార్ట్ వంటింటి రహస్యాలు (Kitchen Hacks) ఉన్నాయని మీకు తెలుసా. ఈ చిట్కాలు గనుక మీకు తెలిస్తే వంటగదిలో పనులు చాలా సులువు అవ్వడమే కాకుండా సమయం కూడా బాగా ఆదా అవుతుంది. ఆ సూపర్ కిచెన్ టిప్స్‌ను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
* పాలు స్టవ్ మీద పెట్టి చిన్న పనిలో పడగానే అవి పొంగిపోవడం కామన్. అలా జరగకూడదంటే పాలను లో-టు-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఆ గిన్నెపై ఒక ‘చెక్క గరిటె’ (Wooden Spoon) అడ్డంగా పెట్టాలి. చెక్క వేడిని గ్రహించదు కాబట్టి పాలు పైకి పొంగకుండా లోపలే మరుగుతాయి.
* కొత్తిమీర, కరివేపాకు వంటివి పాడవకుండా ఉండాలంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్ అడుగున, పైన టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్ వేసి స్టోర్ చేయాలి. అలాగే పచ్చిమిర్చి, క్యారెట్‌లకు తొడిమిలు తీసేసి దాచుకుంటే ఎక్కువ రోజులు కుళ్లిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.
* సింక్‌పై తెల్లటి మరకలు పోవడానికి సబీనా పౌడర్, బేకింగ్ సోడా వేసి వెనిగర్ లేదా నిమ్మరసంతో రుద్దితే మెరిసిపోతుంది. వారానికి ఒకసారి రాత్రి పూట వంట పూర్తయ్యాక సింక్ హోల్‌లో వేడి నీళ్లు, ఉప్పు, బేకింగ్ సోడా, వెనిగర్ పోస్తే డ్రైనేజీ క్లియర్ అవ్వడమే కాకుండా బొద్దింకలు, క్రిమి కీటకాలు రావు.
* ఒక చిన్న గ్లాస్ వెనిగర్, అంతే మోతాదులో నీరు, ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ కలిపి స్ప్రే బాటిల్‌లో ఉంచుకోవాలి. దీనిని స్టవ్ ప్లాట్‌ఫారమ్, ఆయిల్ డబ్బాలు, కిచెన్ వాల్స్‌పై స్ప్రే చేసి తుడిస్తే జిడ్డు ఇట్టే వదిలిపోతుంది. పైగా ఈ స్మెల్‌కి ఈగలు, పురుగులు కూడా రావు.
* కొత్త పాత్రలపై ఉండే లేబుల్ స్టిక్కర్లు ఈజీగా రావాలంటే స్టీల్ గిన్నెలను స్టవ్ మీద లైట్ గా హీట్ చేయాలి. అదే గ్లాస్ లేదా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే కొద్దిగా వేడి నీళ్లలో 10 నిమిషాలు నానబెడితే స్టిక్కర్ గమ్ మెల్ట్ అయి సులువుగా ఊడి వచ్చేస్తుంది.
* స్టీల్ బాటిల్స్ లోపల ఉండే సిలికాన్/రబ్బర్ రింగ్‌ను తీసి విడిగా క్లీన్ చేయాలి. బాటిల్స్ లోపల రాళ్ల ఉప్పు, బేకింగ్ సోడా, వెనిగర్, గోరువెచ్చని నీరు పోసి కాసేపు షేక్ చేసి పక్కన పెట్టి కడిగితే లోపల బ్యాక్టీరియా, బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోతాయి.
* ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా లేదా వెనిగర్ పోసి ఫ్రిడ్జ్ లోని ఒక మూలలో ఉంచాలి.
* పచ్చి కొబ్బరిని కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను 2, 3 గంటల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి కూలింగ్ తగ్గాక చాకుతో కొద్దిగా నొక్కితే పెంకు నుండి కొబ్బరి మొత్తం సులువుగా వస్తుంది.
* సమ్మర్‌లో గుడ్లు త్వరగా పాడవుతాయి. ఒక గ్లాసు నీటిలో ఎగ్ వేసినప్పుడు అది అడుగుకు వెళ్తే మంచి గుడ్డు అని అర్థం. అలా కాకుండా పైకి తేలితే అది పాడైపోయిందని గుర్తించాలి.
* వంట చేసేటప్పుడు చెయ్యి చిన్నగా కట్ అయితే వెంటనే పసుపు పెడితే బ్లీడింగ్ ఆగుతుంది (యాంటీసెప్టిక్). ఒకవేళ చెయ్యి కాలితే వెంటనే ఎలాంటి నీళ్లు పెట్టకుండా టూత్ పేస్ట్ రాస్తే బొబ్బలు రాకుండా ఉంటాయి.
* మష్రూమ్స్‌ను నీటిలో ఎక్కువసేపు నానబెట్టకూడదు, ఎందుకంటే అవి నీటిని పీల్చేసి టేస్ట్ మారిపోతాయి. ఒక పల్చటి గుడ్డతో మట్టిని తుడిచేసి, ఆ తర్వాత ఒకటి రెండు సార్లు నార్మల్‌గా వాష్ చేసుకుంటే సరిపోతుంది.
* పల్లీలు వేయించాక ఒక క్లాత్‌లో వేసి నలిపితే పొట్టు తర్వగా ఊడి వస్తుంది. ఆ తర్వాత అన్నం వార్చే జల్లెడ లేదా రంధ్రాలున్న గరిటెలో వేసి జల్లించేస్తే పొట్టు కింద పడిపోయి, పల్లీలు విడిగా వచ్చేస్తాయి.
* ఇడ్లీ పాత్రలు లేదా రైస్ కుక్కర్లలో నీళ్లు మరిగించినప్పుడు తెల్లటి స్కేలింగ్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే నీటిలో ఒక నిమ్మ చెక్కను వేసి స్టీమ్ చేసుకోవాలి.
* ఉల్లిపాయలు కట్ చేయడానికి ఒక అరగంట ముందు వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఆ తర్వాత తీసి కట్ చేస్తే కళ్లు అస్సలు మండవు, నీళ్లు కూడా రావు.
* వెల్లుల్లి రెబ్బలను విడదీసి, స్టవ్ మీద పాన్‌లో వేసి లైట్‌గా గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేస్తే వాటి పొట్టు చేతితో నలపగానే చాలా ఈజీగా వచ్చేస్తుంది.

