Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్‌షీట్ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Bedsheets for Summer: వేసవి కాలంలో రాత్రివేళ నిద్రపోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతుంది. ఫ్యాన్ లేదా కూలర్ నడుస్తున్నప్పటికీ, మంచం మీద పడుకున్న వెంటనే వేడి ఎక్కువగా అనిపించడం సహజం.. వేసవి ఉక్కపోతతో బెడ్ రూమ్‌లో నిద్రపట్టడమే కష్టంగా మారిపోతుంది.. ఈ సమస్యకు వాతావరణమే కారణమని అనుకుంటాం కానీ, చాలా సందర్భాల్లో మనం ఉపయోగించే బెడ్‌షీట్ కూడా ముఖ్య కారణం అవుతుంది. మందపాటి, సింథటిక్ లేదా ముదురు రంగు బెడ్షీట్లు వేడిని బంధించి, శరీరానికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Also Read
- National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
- Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
- Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
- Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
రోజంతా అలసట తర్వాత హాయిగా నిద్రపోవాలంటే చల్లగా, మృదువుగా ఉండే పడక అవసరం. అందుకే వేసవిలో సరైన బెడ్‌షీట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం అలంకరణకే కాదు, సౌకర్యానికి కూడా కీలకం. సరైన ఫ్యాబ్రిక్ మరియు రంగు ఎంపిక వల్ల రాత్రి నిద్ర నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. వేసవికి కాటన్ బెడ్షీట్లు అత్యుత్తమ ఎంపికగా చెప్పొచ్చు. ఇవి తేలికగా, మృదువుగా ఉండటంతో పాటు గాలి సులభంగా ప్రసరించేలా చేస్తాయి. ముఖ్యంగా 100 శాతం స్వచ్ఛమైన కాటన్ షీట్లు శరీరాన్ని చల్లగా ఉంచి చెమటను తగ్గిస్తాయి. అందుకే వేసవిలో ఇవి ఎక్కువగా ఉపయోగించాలి.
* లినెన్ బెడ్షీట్లకు కూడా మంచి డిమాండ్ పెరిగింది. ఇవి స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా, శరీరంలోని వేడిని త్వరగా బయటకు పంపే గుణం కలిగి ఉంటాయి. కొద్దిగా భిన్నమైన టెక్స్చర్ ఉన్నప్పటికీ, వేసవిలో ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి.
* రంగుల ఎంపిక కూడా చాలా ముఖ్యమైనది. తెలుపు, లేత నీలం, పాస్టెల్ పింక్, పుదీనా ఆకుపచ్చ వంటి లైట్ కలర్స్ తక్కువ వేడిని గ్రహించి గదికి చల్లని ఫీలింగ్ ఇస్తాయి. ముదురు రంగులు వేడిని ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి వేసవిలో వాటిని తప్పించుకోవడం మంచిది.
* పాలిస్టర్ లేదా సింథటిక్ ఫ్యాబ్రిక్‌లతో చేసిన బెడ్షీట్లను వేసవిలో ఉపయోగించకపోవడం మంచిది. ఇవి చెమటను పట్టి ఉంచి జిగటగా అనిపించేలా చేస్తాయి. దీంతో నిద్రలో అంతరాయం కలుగుతుంది.
* వేసవిలో బెడ్షీట్లను తరచుగా ఉతకడం కూడా అవసరం. తేలికగా ఉతికి త్వరగా ఆరిపోయే షీట్లను ఎంచుకుంటే మరింత సౌకర్యంగా ఉంటుంది. ఉతికేటప్పుడు సున్నితమైన డిటర్జెంట్‌తో పాటు తేలికపాటి సువాసన కలిగిన ఫ్యాబ్రిక్ ఫ్రెషనర్ వాడితే తాజా అనుభూతి ఉంటుంది.
మొత్తానికి, వేసవిలో హాయిగా నిద్రపోవాలంటే కేవలం ఏసీ లేదా కూలర్ మాత్రమే కాదు, సరైన బెడ్‌షీట్ ఎంపిక కూడా కీలకం. తేలికైన ఫ్యాబ్రిక్, లేత రంగులు, శుభ్రత — ఈ మూడు పాటిస్తే వేడికాలంలో కూడా చల్లని, ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించవచ్చు.
తాజావార్తలు
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
-
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
-
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
-
IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
-
AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!