NTV Telugu Site icon

Tattoos: శరీరంపై టాటూలు ఉంటే.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు..

Tattoos On Body

Tattoos On Body

ప్రస్తుతం యువత టాటూలు వేసుకోవడంలో చాలా ఉత్సహం చూపుతున్నారు. తమకు ఇష్టమైన వారి పేర్లు, ఫొటోలను శరీరంలోని పలు భాగాలపై టాటూ రూపంలో వేయించుకుంటున్నారు. అయితే ఇటువంటి టాటూల కారణంగా సమస్యల్లో పడతారని చాలామందికి తెలియదు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత టాటూలకు సంబంధించిన కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలలుకంటున్నవారు.. శరీరంపై పచ్చబొట్టు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురవుతారు. మనదేశంలోని కొన్ని ఉద్యోగాల విషయంలో శరీరంపై పచ్చబొట్టు ఉంటే వారిపై అనర్హత వేటు పడుతుంది. ఆ ఉద్యోగాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Maoists: మావోయిస్టుల ఘాతుకం.. ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో వ్యక్తి హత్య

ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో టాటూల నిషేధం..
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS – ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)
ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS – ఇండియన్ పోలీస్ సర్వీస్)
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS – ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్)
ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS – ఇండియన్ ఫారిన్ సర్వీస్)
భారత సైన్యం
ఇండియన్ నేవీ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఇండియన్ కోస్ట్ గార్డ్
పోలీసు

READ MORE: Aluminium Cookware: వంటకు అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా? చాలా డేంజర్!