NTV Telugu Site icon

Spirituality: రోజూ నిద్ర లేచిన తర్వాత ఇలా చేయండి..అంతా మంచే జరుగుతుంది..!

Sun

Sun

కాలం మారింది. నిద్ర లేచే సమయం కూడా మారింది. పూర్వం సూర్యోదయానికి మందే నిద్రలేచి చక చక పనులు పూర్తి చేసుకునే వారు. ఇప్పుడు సూర్యుడు నడి నెత్తికి వచ్చాక కూడా లేచేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పెరిగిన నైట్ అవుట్ లే దానికి కారణం. కానీ.. ఈపద్ధతిని మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుంచి మన పిల్లలకైనా ఈ నియమాలు చెబుదాం.. పొద్దున్నే నిద్రలేవడం మాత్రమే కాదు…నిత్యం అనుసరించాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: ఆ పాయింట్స్ మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటాయి: ‘విరాజి’ దర్శకుడు ఇంటర్వ్యూ

1. సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి
సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం అలవర్చుకోవాలి. బ్రాహ్మీ అంటే సరస్వతి దేవి. మనలో బుద్ధి ప్రభోదం చెందే సమయం కాబట్టే దానిని బ్రాహ్మీ ముహూర్తం అని పిలుస్తారు. ఈ ముహూర్తాన్ని పూర్వం ఘడియలలో లెక్కపెట్టేవారు. ఘడియ అంటే 24 నిముషాలు అని అర్థం. ఓ ముహూర్తం అంటే 2 ఘడియలకాలం..అంటే.. 48 నిముషాలు. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది ‘బ్రహ్మముహూర్తం’. హిందూ ధర్మశాస్త్రాల్లో ఈ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది. ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్యంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి ఉంటుంది..అందుకే ముహూర్తంలో నిద్రలేచేవారిలో సానుకూల ఆలోచనలు వస్తాయి.

READ MORE:Nirmala Sitharaman: మమత వ్యాఖ్యల్ని ఖండించిన ఆర్థికమంత్రి

2. అరచేతులను చూసి నమస్కరించుకోవాలి…
నిద్రలేచిన వెంటనే చాలామంది చేతులు చూసుకుంటారు. ఇది చాలా మంచి అలవాటు అని చెబుతారు పండితులు.. ఎందుకు అనేది ఈ శ్లోకంలో వివరించారు…

“కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం”

కరాగ్రే వసతే లక్ష్మీ – అరచేయి పైభాగనంలో శ్రీ మహాలక్ష్మి
కర మధ్యే సరస్వతి – చేయి మధ్యభాగంలో సరస్వతి
కర మూలే స్థితా గౌరీ – మణికట్టు వద్ద గౌరీదేవి కొలువై ఉంటారు.
ప్రాతః కాలంలో ఈ శ్లోకం చదివి అరచేతులను కళ్లకు అద్దుకుని లేవడం ద్వారా..ఆ మూడు శక్తులను స్మరించినట్టు.

READ MORE:WhatsApp: భారతదేశంలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా..? కేంద్రం కీలక ప్రకటన..

3. భూమాతను నమస్కారించాలి…
సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

నిద్రలేచిన తర్వాత కాలు కింద మోపే ముందు ఈ శ్లోకం చదవాలి. వాసం అంటే దుస్తులు… సముద్రవసనే దేవీ అంటే సముద్రాన్ని వాసంగా ధరించిన దేవీ అని అర్థం. భూమి 70 శాతం భూమి నీటితో కప్పి ఉంటుంది. భారతీయులు శరీరాన్ని 70శాతం దుస్తులతో కప్పుకున్నట్టే.. భూమిపై 70శాతం నీరున్న ప్రదేశాన్ని దుస్తులుగా ధరించావమ్మా అని అర్థం. పర్వత స్థన మండలే అంటే పర్వతాలను స్థానాలుగా కలిగిన దేవి… అంటే బిడ్డలు అడగకుండానే ఆకలి తెలుసుకుని పాలిచ్చే తల్లి అని అర్థం. అలాంటి భూదేవిపై కాలుమోపుతున్నందుకు క్షమించమని అడుగుతూ అడుగు నేలపై పెట్టాలి.

READ MORE: Viral Video: క్లాస్‌రూమ్‌లో టీచర్ స్లీపింగ్.. విసనకర్రతో విసురుతూ నిద్ర బుచ్చిన చిన్నారులు

4. సుమంగళ ద్రవ్యాలు చూడాలి
చాలామంది నిద్రలేవగానే వివాహితులు అయితే మంగళసూత్రం తీసి కళ్లకు అద్దుకుంటారు. ఇలా చేస్తే సుమంగళి యోగం అని భావిస్తారు. అయితే నిద్రలేవగానే మంగళద్రవ్యాలు ఏం చూసినా ఆరోజంతా శుభం జరుగుతుంది. మంగళద్రవ్యాలంటే అగ్ని, బంగారం, దేవుడి పటం, అద్దం …వీటిలో ఏం చూసి నిద్రలేచినా మంచిదే
5. తల్లిదండ్రులకు నమస్కరించాలి
ఎందుకంటే ప్రపంచంలో కన్న తల్లిదండ్రుల కంటే ఎవ్వరూ గొప్పకాదు.. వారికి ప్రతి రోజూ నమస్కరించాలి.