NTV Telugu Site icon

Body soap: సబ్బు ఖరీదు 2.07 లక్షలా.. ఏముంది ఇందులో అంత ప్రత్యేకత.. ?

Untitled 25

Untitled 25

Handmade Khan Al Saboun: మనిషి అందంగా కనిపించాలి అంటే మాసికఆరోగ్యం బాగుంఉండాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే శారీరక పరిశుభ్రత పాటించాలి. అందుకే మనలో కొంతమంది కేవలం శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తే చాలామంది శుభ్రతతో పాటు అందానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. దానికోసం రకరకాల క్రీంలు, సబ్బులు వినియోగిస్తుంటారు. అయితే సాధారణంగా మనం కొనే సబ్బు 20 రూపాయల నుండి 100 రూపాయలు ఉంటుంది. లేదా ఇంకొంచం ధర ఉండే సబ్బులు మనం చూసి ఉంటాం. కొన్ని సందర్భాలలో డాక్టర్ సూచన మేరకు కొందరు వేరే సబ్బులు వాడుతుంటారు. ఆ సబ్బులు ధర వందల్లోనే ఉంటుంది. దానికే మనం తలపట్టుకుంటాం. కానీ ఒక సబ్బు ధర వందల్లోనో వేలల్లోనే కాదు లక్షల్లో ఉంది అంటే నమ్ముతారా..? అవును ఇది నిజం..? ఈ సబ్బును కొనాలి అనుకుంటే కొన్న ప్రతిసారి లక్షల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరి అంత ఖరీదయిన సబ్బు ఏంటో దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Health benefits: చాకెట్లు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?

హ్యాండ్‌మేడ్ ఖాన్ అల్ సబౌన్ అనే సబ్బు ప్రంపంచంలోనే ఖరీదైన సబ్బుగా ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. దీని ధర $2,800. మన రూపాయల్లో అయితే అక్షరాలా రూ. 2.07 లక్షలు. ఎందుకు ఈ సబ్బు ఇంత ఖరీదు అంటే ఈ సబ్బు తయారీకి 17 గ్రాముల స్వచ్ఛమైన బంగారు పొడి (24 క్యారెట్), మరియు మూడు గ్రాముల డైమండ్ పౌడర్, స్వచ్ఛమైన నూనెలు, ఆర్గానిక్ తేనె, పాత ఔద్, ఖర్జూరాలు ఉపయోగిస్తారు. ఇది సహజ సువాసనలతో ఉటుంది. చర్మానికి హాని కలిగించదు అని ఈ సబ్బు తయారీ సంస్థ యజమాని తెలిపారు. ఈ సబ్బును తాయారు చెయ్యడానికి 6 నెలలు పడుతుంది. ఈ సబ్బులు UAEలోని కొన్ని ప్రత్యేకమైన దుకాణాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, కంపెనీ విక్రయించే అత్యంత ఖరీదైన ఈ సబ్బు VIPలు మరియు ప్రత్యేక అతిథుల కోసం మాత్రమే రిజర్వ్ చేయబడింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ సబ్బుని 2013 లో తొలిసారిగా తాయారు చేసారు. ఇది మానవులపై మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపుతుందని ఈ సబ్బు తయారి సంస్థ యజమాని పేర్కొన్నారు.ఇది గతంలో ఖరీదైన చీజ్ ముక్కలాగా ఉండేది. కాగా ప్రస్తతం గోల్డ్ అండ్ లైట్ పింక్ రంగులో ఉంది.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.