Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tea Drinking Mistakes: భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్ (Tea) కు ప్రత్యేక స్థానం ఉంది. చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగితేనే రోజు మొదలైనట్లు అనిపిస్తుంది. అయితే టీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, దానిని తాగే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. రోజూ టీ తాగే అలవాటు ఉన్నవారు ముఖ్యంగా ఈ తప్పులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
వేడివేడి టీ
చాలామందికి టీను బాగా వేడిగా ఉన్నప్పుడే సిప్ చేస్తూ తాగడం అలవాటు. అయితే ఇలా తరచుగా చాలా వేడి పానీయాలు తీసుకోవడం వల్ల అన్నవాహికపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న చాలా వేడి పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం అన్నవాహిక క్యాన్సర్ ముప్పుతో సంబంధం కలిగి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు చెందిన పరిశోధనా సంస్థ గతంలో పేర్కొంది. వేడి టీ పదేపదే అన్నవాహిక గుండా వెళ్లడం వల్ల అక్కడి పొరలో ఇరిటేషన్ కలిగే అవకాశం ఉంటుంది. అందుకే చాయ్ తయారైన వెంటనే తాగకుండా.. కొద్దిసేపు చల్లారిన తర్వాత తీసుకోవడం మంచిది.
Also Read
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Kitchen Cleaning Tips: కిచెన్ సింక్లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
- Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
ఖాళీ కడుపుతో లేదా భోజనం వెంటనే తర్వాత
టీలో ఉండే టానిన్లు ఆహారం నుంచి శరీరం గ్రహించే ఐరన్ పరిమాణాన్ని ప్రభావితం చేయవచ్చు. అందువల్ల భోజనం చేస్తున్న సమయంలో లేదా భోజనం చేసిన వెంటనే చాయ్ తాగే అలవాటును తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు కూడా కొందరిలో ఎసిడిటీ లేదా కడుపులో అసౌకర్యాన్ని పెంచవచ్చు. కాబట్టి ఖాళీ కడుపుతో టీ తాగకుండా ఉండటం మంచిది.
ప్లాస్టిక్ స్ట్రైనర్
టీ వడకట్టడానికి ప్లాస్టిక్ స్ట్రైనర్ను ఉపయోగించడం కూడా తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరుగుతున్నంత వేడిగా ఉన్న టీను ప్లాస్టిక్ స్ట్రైనర్లో పోయడం వల్ల ప్లాస్టిక్ నుంచి సూక్ష్మ కణాలు విడుదలయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. అందుకే వీలైనంత వరకు ప్లాస్టిక్ స్ట్రైనర్కు బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రైనర్ను ఉపయోగించడం మంచి ప్రత్యామ్నాయం. ఇది వేడి పానీయాలను వడకట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!