Site icon NTV Telugu

Nightmares: చెడ్డ, పీడ కలలతో బాధపడుతున్నారా? ఇది కూడా ఓ కారణం కావచ్చు..!

Nightmares

Nightmares

Nightmares: హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం సరిగ్గా పనిచేయగలం. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక, ఆరోగ్యం విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇక, రాత్రి భోజనం అనేది చాలా కీలకమైంది. అయితే, మనలో చాలా మంది ఇష్టపడేది డిన్నర్‌నే. రాత్రిపూట భోజనం అనంతరం పడుకునే ముందు పాల పదార్థాలు, కేకులు, బిస్కెట్లు, ఐస్‌క్రీముల వంటి తీపి పదార్థాలు తినడం వల్ల ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఏంటా ప్రమాదం? అనే అంశం గురించి తెలుసుకుందాం..

READ MORE: Visakhapatnam : ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్లాంట్‌లో పిడుగు ప్రభావంతో భారీ అగ్ని ప్రమాదం

కొందరికి పదే పదే చెడ్డ, పీడ కలలు వస్తుంటాయి. ఈ కలలు ఎందుకు వస్తున్నాయని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రియల్‌ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఆసక్తిక విషయాలు బయటపడ్డాయి. పడుకునే ముందు పాల పదార్థాలు, కేకులు, బిస్కెట్లు, ఐస్‌క్రీముల వంటి తీపి పదార్థాలు తినడం వల్ల పీడకలల వస్తాయట. ఈ విషయంలో తీపి పదార్థాల అనంతరం పాల ఉత్పత్తులు రెండో స్థానాన్ని ఆక్రమిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఎందుకిలా? ఆహార అలర్జీలు లేదా లాక్టోజ్‌ పడకపోవటం ప్రధానంగా కారణమవుతున్నాయని చెబుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా తినటం, ఆకలిని పట్టించుకోకపోవటం వంటి అనారోగ్యకర అలవాట్లతో పీడకలలు, చెడు కలలు మరింత ఎక్కువగా వస్తున్నట్టూ తేలింది. జ్ఞాపకాలను మెదడు పదిలపరచుకునేటప్పుడు పీడకలలు వస్తుంటాయని నాడీ వైద్య సిద్ధాంతాలు సూచిస్తున్నాయి. ఆందోళన, మానసిక ఒత్తిడి, వేదన వంటివి భయంకర కలలకు దోహదం చేస్తుంటాయి. అయితే కలలు మారటానికి ఆహార అంశాలు కారణమవుతాయా? కలలు ఆహారాన్ని ఎంచుకోవటంలో ప్రభావం చూపుతాయా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు.

Exit mobile version