Suplements For Bone Density: ఎముకలు.. మానవ శరీరానికి పునాది లాంటివి. ఈ ఎముకలు ఎంత బలంగా ఉంటే, అంతే ఆరోగ్యంగా శరీరం ఉంటుంది. అలా కాకుండా ఎముకలు బలహీనపడితే మాత్రం, మన శరీరం ఏ పని చేయడానికీ సహకరించదు. కాబట్టి.. ఎముకల్ని మనం బలంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా.. వయసు పెరిగేకొద్దీ ఎముకల సాంధ్రత తగ్గుతూ వస్తుంది. అలాంటప్పుడు ఎముకల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహానం, సరైన సప్లిమెంట్లను తీసుకుంటే.. ఎముకలు దృఢంగా తయారవుతాయి. మరి, ఆ సప్లిమెంట్లేంటో తెలుసుకుందాం..!
Harish Rao: ప్రపంచం ముందు దేశం పరువు పోతోంది.. బీబీసీ ఐటీ దాడులపై హరీశ్‌రావు
1. కాల్షియం: కాల్షియం, ఫాస్ఫేట్‌తో తయారయ్యే ఎముకలు దృఢంగా ఉండాలంటే, మన శరీరానికి రోజుకు 1500 మి.గ్రా కాల్షియం అవసరం. ఈ కాల్షియం సప్లిమెంట్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం సిట్రేట్ రూపంలో లభిస్తాయి. కాల్షియం సిట్రేట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాల్షియం కార్బోనేట్ మాత్రం ఆహారం తర్వాత తీసుకోవాలి.
2. విటమిన్ డీ: ఇది మన తీసుకునే ఆహారం నుంచి కాల్షియంను రవాణా చేసే కండక్టర్‌గా పనిచేస్తుంది. కాల్షియంను సరిగ్గా గ్రహించడంలో విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డీని ఆహారం ద్వారా, సూర్యరశ్మికి గురికావడం ద్వారా పొందవచ్చు. విటమిన్ D, D3 రూపంలోనూ సప్లిమెంట్లు అందుబాటులో ఉంటాయి.
3. మెగ్నీషియం: మన శరీరానికి అత్యవసరమైన ఖనిజాల్లో ఈ మెగ్నీషియం ఒకటి. ఇది ఎముకల్ని బలంగా, దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. పెద్దవాళ్లు ప్రతిరోజూ ఈ మెగ్నీషియం సప్లిమెంట్‌ను 250-400mg తీసుకుంటే, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.
4. విటమిన్ కే: ఇది ఎముకల ఆరోగ్యానికి విటమిన్ Dతో కలిసి పనిచేస్తుంది. ఇందులో కే1, కే2 అని రెండు రకాలుంటాయి. ఈ సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా తీసుకుంటే.. ఎముకల సాంద్రత మెరుగుపడుతుంది. ముఖ్యంగా.. కే2 సప్లిమెంట్ ఎముకల సమస్యల్ని నివారించడంలో తోడ్పడుతుంది.