Sunday Special: ఉరుకుల పరుగుల జీవితంలో సమయం దొరుకుడే ఎక్కువగా మారిపోయింది ఈ రోజుల్లో. అలాంటిది లేకలేక వచ్చిన ఆదివారం పూట సెలవును మీరు ఏం చేస్తున్నారని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? కళ్లు మూసి తెరిచేలోపు సెలవు రోజు గడిచిపోవడం మీకు ఎప్పుడైనా అనుభవం అయ్యిందా.. ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ఆదివారం ఎలా గడుపుతున్నారు.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఈ స్టోరీ చదివిన తర్వాత నుంచి మరోలెక్క.. సరేనా.. కొంచెం సరదా ఇందులో చెప్పేవాటిని కుదిరితే ట్రై చేయండి..
READ ALSO: H-1B visa fee hike: H-1B వీసాలపై ట్రంప్ సెల్ఫ్ గోల్.. భారత్‌కే లాభమంటున్న నిపుణులు..
ఆదివారం రోజు చాలా మందికి సెలవు దొరుకుతుంది కాబట్టి.. ఈ రోజులో వీలైనంత ఎక్కువ సమయం కుటుంబం, స్నేహితులతో గడపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం పెరుగుతుందని చెబుతున్నారు. వారం మొత్తంలో ఎలాగు ఇంట్లో వాళ్లతో, స్నేహితులతో సరిగ్గా మాట్లాడటానికి సమయం ఉండదు. కనీసం సెలవు రోజన్నా వారితో సరదా గడపటం చేస్తూ, మీతో ఉన్న వ్యక్తులను వీలైనంత సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలని చెప్తున్నారు. ఆదివారం రోజు యోగా, ప్రాణాయామం వంటి ఆరోగ్య పరమైన కార్యకలాపాలలో పాల్గొనాలని చెబుతున్నారు. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే కార్యక్రమాలు అని అంటున్నారు. వీటితో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పొందొచ్చని సూచిస్తున్నారు.
ఈ రోజున వీలైనంత ఎక్కువ సమయం ప్రకృతితో గడపాలని, ప్రకృతి ద్వారా మానసిక శాంతి, ఆరోగ్యం సమకూరుతాయని అంటున్నారు. కుదిరితే ఈ ఒక్కరోజు సరదాగా ఇంట్లో వాళ్లతో కలిసి రకరకాల వంటకాలు చేయాలని చెబుతున్నారు. ఎలాగో వారం మొత్తంలో తిరికలేకనో, ఓపిక లేకనో ఇంట్లో వండుకోవడం కంటే ఆఫీస్‌ల్లో ఆర్డర్ పెట్టుకోవచ్చులే అనో, లేదా స్నేహితులతో కలిసి ఫుడ్ కోర్టులకు, రెస్టారెంట్లకు వెళ్లడం లాంటివి చేస్తుంటారు కొందరు. ముఖ్యంగా వీళ్లు ఆదివారం రోజు అయినా ఇంట్లో వంట చేసుకోవాలని, ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలని చెప్తున్నారు.
పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో ఎదుగుతున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు వహించాలని, వారితో ఫ్రెండ్లీగా ఉండాలని చెబుతున్నారు. వారం మొత్తం పిల్లలు స్కూల్ అని మీరు ఆఫీస్ అని తిరిక లేకుండా గడపడం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వారం మొత్తంలో దొరికిన ఆదివారం రోజున పిల్లలకు కొద్దిసేపు అయినా సమయాన్ని కేటాయించాలని సూచిస్తున్నారు. నచ్చిన సంగీతాన్ని వినడం, సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం లాంటివి చేయాలని, తల్లిదండ్రులను చూసి ఈ అలవాట్లను పిల్లలు నేర్చుకుంటారని చెబుతున్నారు.
READ ALSO: Viral Wedding: పోయే కాలంలో పెళ్లేంది సామి.. ! 72 ఏళ్ల వరుడితో.. 27 ఏళ్ల వధువుకు వివాహం