NTV Telugu Site icon

Sunday : ఆదివారం రోజు ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా..? ఇది వింటే హార్ట్ ఎటాకే..

Slpng Tips

Slpng Tips

వీకెండ్ అంటే చాలామందికి ఎక్కడ లేని బద్ధకం వస్తుంది.. సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకుండా కొంతకంగా అలాగే పడుకొని ఉంటారు. వారం అంతా ఉరుకుల పరుగులు తీస్తూ కంటి నిండా నిద్ర లేనివారు ఆదివారం ఎంచక్కా గురక పెట్టి మరి పదింటి వరకు పడుకొని నిద్రపోతూ ఉంటారు.. కొందరు అసలు నిద్రలేవరు.. ఇక హాస్టల్ లో ఉండేవారు సాయంత్రం వరకు పడుకుంటారు.. అలా పడుకోవడం మంచిదికానీ వైద్యులు చెబుతుంన్నారు… ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వారాంతాల్లో 90 నిమిషాలు ఎక్కువ సమయం నిద్రపోతే కడుపులో గట్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుందట.. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్, ఒబెసిటి వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణం ఆవుతుందట. ఎక్కువ సమయం పాటు పడుకోవడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల రోజూవారి భోజన సమయాలు డిస్టర్బ్ అవుతాయి. ఈ డైట్ మెస్ శరీరంలో ఇన్ ఫ్లమేషన్ కు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఉదయం ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారు తినే ఆహారం అంత హెల్దీగా ఉండదని, చక్కెర కలిగిన పానీయాలు ఎక్కువగానూ, పండ్లు, గింజలు తక్కువ గానూ తింటారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.. ఇలా చెయ్యడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతున్నారు..

బాడీ క్లాక్‌లో అంతరాయం వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు రావడం, మధుమేహం బారిన పడడం వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే కొన్ని రకాల మైక్రోబ్స్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. జీర్ణవ్యవస్థలో దాదాపు 17 రకాల బ్యాక్టీరియా జాతులను గుర్తించారట.. బరువు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయట.. ఇంకా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చునని చెబుతున్నారు.. సో బీర్ కేర్ ఫుల్ మిత్రమా..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.