Fitness: 60 ఏళ్లు దాటాక ఏ వ్యాయామం బెస్ట్? నడక, ఈత కాదు.. శాస్త్రవేత్తలు సూచిస్తున్నది ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fitness: వయసు పెరిగేకొద్దీ శరీరంలో వచ్చే మార్పులు సహజం. 60 ఏళ్లు దాటిన తర్వాత కండరాల బలం తగ్గడం, ఎముకలు బలహీనపడటం, బ్యాలెన్స్ తగ్గిపోవడం, చిన్న చిన్న పనులు చేయడానికే అలసటగా అనిపించడం వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తాయి. అందుకే ఈ వయసులో ఎలాంటి వ్యాయామం చేయాలి? కేవలం నడక సరిపోతుందా? లేక ఈత, యోగా, సైక్లింగ్ లాంటివి మంచివా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే తాజా పరిశోధనలు చెబుతున్న విషయం ఏమిటంటే, 60 ఏళ్లు దాటిన తర్వాత కేవలం నడక మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అది ఏ వ్యాయామం? ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుందాం.
వైద్య నిపుణులు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి సంస్థలు కూడా 60 ఏళ్లు దాటిన వారిలో ‘స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే కండరాల బలం పెంచే వ్యాయామాలను తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నాయి. చాలా మంది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే జిమ్‌లో భారీ బరువులు ఎత్తడమే అనుకుంటారు. కానీ వాస్తవానికి తేలికపాటి డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్లు, యోగా వ్యాయామాలు కూడా ఇందులో భాగమే. ఇవి కండరాలను బలోపేతం చేయడంతో పాటు రోజువారీ పనులు సులభంగా చేయడానికి సహాయపడతాయి.
Also Read
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
వయసు పెరిగే కొద్దీ ప్రతి సంవత్సరం కండరాల పరిమాణం క్రమంగా తగ్గుతుంది. దీనిని సార్కోపీనియా అని పిలుస్తారు. ఈ పరిస్థితిని నియంత్రించడంలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కండరాలు బలంగా ఉంటే మెట్లు ఎక్కడం, కుర్చీ నుంచి లేవడం, బరువులు మోయడం వంటి సాధారణ పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. అంతేకాదు, పడిపోతే ఎముకలు విరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎముకల ఆరోగ్యానికీ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో క్రమం తప్పకుండా బలం పెంచే వ్యాయామాలు చేస్తే ఎముకలు దృఢంగా మారే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
అంతేకాదు, ఈ వ్యాయామాలు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి, శరీర మెటబాలిజం మెరుగుపడటానికి కూడా సహాయపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వృద్ధుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, మానసిక ఆరోగ్యం మెరుగుపడడం, డిప్రెషన్ ప్రమాదం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే 60 ఏళ్లు దాటిన తర్వాత ఏ వ్యాయామమైనా ఒక్కసారిగా ప్రారంభించడం మంచిది కాదు. ముందుగా వైద్యుల సలహా తీసుకుని, ఫిజియోథెరపిస్ట్ లేదా ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో తక్కువ మోతాదులో మొదలుపెట్టాలి. వారానికి రెండు నుంచి మూడు రోజుల పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడంతో పాటు మిగిలిన రోజుల్లో నడక, యోగా, బ్యాలెన్స్ వ్యాయామాలు కూడా చేస్తే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు.
ఆరోగ్యంగా, చురుకుగా జీవించాలంటే వయసు అడ్డంకి కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం, తగిన నిద్ర, క్రమం తప్పని వ్యాయామంతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ను కూడా లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. అయితే ఇప్పటికే గుండె జబ్బులు, కీళ్ల సమస్యలు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సూచనల మేరకే వ్యాయామం ప్రారంభించడం ఉత్తమం.
తాజావార్తలు
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!