రోజు మనం సాధారణంగా పడుకునే విధానంలో మార్పులు చేస్తే .. పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ఎందుకంటే.. కొన్ని రకాల నిద్ర భంగిమలు సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఎముకలు, కండరాలు, వెన్ను నొప్పికి కారణం అవుతుంది. వంకర తిరిగి బోర్లా పడుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.
Read Also: AI Integration: ఏఐ కారణంగా పెరగనున్న స్మార్ట్ టీవీ ధరలు
పడుకునే అలవాట్లు కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు పొట్ట మంచానికి ఆనించేలా బోర్లా పడుకొని, ఒక కాలును వంచి, ముఖం కింది భాగంవైపు ఉంచిన భంగిమలో పడుకుంటే కండరాలు, ఎముకలు, వెన్నెముక, మెడ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ పొజిషన్ మీ వెన్నెముకను గంటల తరబడి ఒత్తిడికి గురిచేస్తుంది.
Read Also:Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న పోలీసులు
బోర్లా పడుకున్నప్పుడు కాళ్లను ముఖం వైపునకు వంచి పడుకోవడం కారణంగా మెడ అసహజమైన భంగిమలోకి తిరిగి, కండరాలు బిగుసుకుపోతాయి. నరాలు ఒత్తిడికి లోనవుతాయి. ఈ పరిస్థితి మీ దిగువ వెన్ను భాగంపై ప్రభావం చూపడంవల్ల అది సహజ వంపును కోల్పోతుంది. అలాగే ఛాతీ, కడుపు భాగం ఒత్తిడికి గురై బ్రీతింగ్ సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి పడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బోర్లా పడుకున్నప్పటికీ… ఒక కాలును వంచి ముఖం వైపు ఉంచడం వంటివి చేయకూడదు. దీనివల్ల వెన్ను, మెడ, కండరాల నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించబడిందని గమనించాలి. పూర్తి సమాచారం కోసం సంబంధిత డాక్టర్లను సంప్రదించాలని కోరుతున్నాము.
