Site icon NTV Telugu

Sleep Tourism: నయా ట్రెండ్.. స్లీప్ టూరిజంకు పోతారా.. !

Sleep Tourism

Sleep Tourism

Sleep Tourism: ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలనే కల ఎంతో మందిలో ఉంటుంది. అనేక సమస్యలు, మానసిక ప్రశాంతత కోసం ఇలా చాలా మంది పర్యటనలకు వెళ్తుంటారు. బాస్ ఇప్పుడు ట్రెండ్ మారింది తెలుసా.. ఏందా ట్రెండ్ అనుకుంటున్నారా.. ఒళ్లు మర్చిపోయి నిద్రపోవడం. నిజం అండీ బాబు.. దీనికే స్లీప్​ టూరిజం అనే పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ నయా ట్రెండ్ కథ ఏంటి, ఎందుకు ఈ ట్రెండ్ పాపులర్​అవుతుంది.. మన దేశంలో ఈ స్లీప్​టూరిజంకు అనువైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Cyber Fraud : సైబర్ క్రైమ్ పోలీసుల దాడులు.. ట్రేడింగ్ మోసం నుంచి ఫెడెక్స్ ఫ్రాడ్ వరకు

తెలిసినా త్యాగం చేస్తున్నారు..
నిజంగా ఈ జనరేషన్‌లో చాలా మందికి పని ఒత్తిడి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో కాలక్షేపం చేస్తూ సరైన నిద్ర పోవడం లేదు. మనిషికి మంచి నిద్ర లేకపోతే తలెత్తే అనారోగ్య సమస్యలు తెలిసినా కూడా ఎలక్ట్రానిక్ పరికరాల మోజులో పడి నిద్రను త్యాగం చేస్తున్నారు. ఇగో వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చేందే..’స్లీప్ టూరిజం’. ప్రస్తుతం దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. టూరిజం అంటే సాధారణంగా కొత్త ప్రదేశాలు వెళ్లడం, చూడటంగా భావిస్తాం. కానీ స్లీప్ టూరిజం మాత్రం ప్రత్యేకం. ఈ టూరిజంలో శరీరానికి, మనసుకీ ప్రశాంతమైన నిద్రను అందించడమే దీన్ని ముఖ్య ఉద్దేశం. తాజా ఈ టూరిజం ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త పరిశ్రమగా ఎదుగుతోంది. భవిష్యత్తులో ఈ టూరిజం బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారుతుందంటున్నారు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోనూ నయా ట్రెండ్‌..
స్లీప్ టూరిజం అంటే నిద్ర కోసం ప్రత్యేకంగా పర్యటనలకు వెళ్లడం. పనిలో ఒత్తిడి, అలసట బాధపడుతున్న వారు కొత్త ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడంతో పాటు మనసారా నిద్ర పోవడమే ఈ పర్యటకం ప్రత్యేకత. దీన్ని ‘నాప్​కేషన్స్’ లేదా ‘డ్రీమ్ టూరిజం’ అని కూడా అంటున్నారు. ఇప్పటికే అమెరికా, జపాన్, దుబాయ్, యూరప్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకమైన ‘స్లీప్ హోటల్స్’ ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలోనూ ఈ పద్ధతి క్రమంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఈ ట్రెండ్‌ను హిమాలయ ప్రాంతాలు, కేరళలోని ఆయుర్వేద రిసార్ట్‌లు, గోవా బీచ్ రిసార్ట్‌లలో అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకమైన ఆయుర్వేద మసాజ్‌లు, హెర్బల్ థెరపీ, యోగా, ధ్యానం ద్వారా సహజ నిద్రను కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అవసరం అంటారా?
ఇండియన్ జర్నల్ ఆఫ్ స్లీప్ మెడికన్ నివేదికలో పలు సంచలన నివేదికలు వెలుగుచూశాయి.. మన దేశంలో 61 శాతం మంది రోజుకు ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్నారని ఈ నివేదిక పేర్కొంది. పలు అధ్యయనాల్లో.. ప్రతి 10 మందిలో ముగ్గురు కంటే తక్కువ మంది మాత్రమే సాధారణ నిద్రపోతున్నారని వెల్లడైంది. చాలా మంది రోజులో ఆరు గంటలు కూడా నిద్ర పోవడం లేదని పేర్కొంటున్నాయి. ఈసందర్భంగా పలువురు నిపుణులు మాట్లాడుతూ.. రోజువారీ కార్యకలాపాలు, పనిలో ఒత్తిడితో పోరాటం, కుటుంబం ఆర్థిక భారం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి ఈ స్లీప్ టూరిజం దోహదం చేస్తుందంటున్నారు. కొత్త ప్రాంతాల పర్యటనకు వెళ్లి, అక్కడ విశ్రాంతితో పాటు హాయిగా నిద్రపోయేందుకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు.

స్లీప్​టూరిజంకు అనువుగా ఉండే ప్రాంతాలు..
మన దేశంలో స్లీప్ టూరిజంకు ఉత్తరాఖండ్​లోని రుషికేష్, బ్యాక్ వాటర్.. హౌజ్​బోటులకు ప్రసిద్ధి చెందిన కేరళలోని అలెప్పీ, పచ్చని కాఫీ తోటలు, పొగమంచు కొండలు, ప్రశాంత వాతావరణాన్ని కలిగిన కర్ణాటక లోని కూర్గ్, గోవా, కర్ణాటకలోని గోకర్ణలో ప్రశాంతంగా ఉండే బీచ్‌లు అనువైనవి. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితిలోయ, తీర్థన్ వ్యాలీ, గ్రేటర్ హిమాలయన్ నేషనల్ పార్కు మొదలైనవి స్లీప్​టూరిజంకు అనువుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో హాయిగా నిద్రపోయేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన సౌకర్యవంతమైన మంచాలు, నిద్ర నాణ్యతను మెరుగుపరిచే లైటింగ్ సిస్టమ్, నిద్ర నిపుణుల ద్వారా శిక్షణ, ప్రత్యేక సౌండ్ ప్రూప్ గదులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

READ ALSO: Russia Ukraine War: పసి కూనపై రష్యాకు ఎందుకు ఇంత పగ.. !

Exit mobile version