Site icon NTV Telugu

Glowing Skin Tips : మెరిసే చర్మం కోసం రోజూ దీన్ని తాగాల్సిందే..

Superfoods For A Glowing Skin

Superfoods For A Glowing Skin

అందంగా, కాంతివంతంగా ఉండాలని నలుగురు అనుకుంటారు.. అయితే మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్లు వల్ల కొందరి చర్మం ఎప్పుడు డల్ గా ఉంటుంది.. కొందరికి మొటిమలు, మచ్చలు వస్తుంటాయి.. వాటిని కప్పేస్తూ రకరకాల కెమికల్ కలిసిన క్రీములను ఎక్కువగా వాడుతుంటారు..కానీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోతుంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజూ తాగితే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం.. ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ డ్రింక్ కోసం కావలసిన పదార్థాలు..

నల్ల ఎండు ద్రాక్షాలు..

కుంకుమ పువ్వు..

గోండ్ కటిరా..

సబ్జా గింజలు..

వీటిని సపరేటుగా తీసుకొని రాత్రింతా నానబెట్టాలి.. మరుసటి రోజు ఉదయం అన్నింటినీ కలిపి ఒక జార్‌లోకి తీసుకుని బ్లెండ్ చేయాలి. అనంతరం వచ్చే డ్రింక్‌ను ఒక గ్లాస్ లోకి తీసుకుని ఉదయం టిఫిన్ చేశాక తీసుకోవడం మంచిది.. ఈ పానీయన్ని రోజూ తాగడం వల్ల కేవలం వారం రోజుల్లోనే నమ్మలేనంత మార్పును చూస్తారు.. చర్మం అందంగా మారడం మాత్రమే కాదు మృదువుగా కూడా ఉంటుంది.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version