NTV Telugu Site icon

Skin Care Tips: ఈ హోం రెమెడీ ట్రై చేస్తే.. మీ ముఖం చందమామలా మెరుస్తుంది!

Skin Care Tips

Skin Care Tips

Make your face glow like moon with Chandan Face Pack: చర్మ సంరక్షణలో ‘చందనం’ కీలక పాత్ర పోషిస్తుంది. చందనం చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా.. ముఖంపై ఉండే రంధ్రాలను పూడ్చడంలో సహాయపడుతుంది. అందుకే ఎండాకాలంలో మీ చర్మానికి చందనం పేస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో గంధాన్ని పూయడం వల్ల ట్యానింగ్ మరియు డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ముఖంలో వృద్ధాప్య సంకేతాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు మొటిమల సమస్యను కూడా దూరం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గంధపు ఫేస్ ప్యాక్‌ను తయారుచేసే పద్ధతి ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.

చందనం ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు (Chandan Face Pack Ingredients):
# 2-3 టీస్పూన్ల రోజ్ వాటర్
# 1 విటమిన్-ఇ క్యాప్సూల్
# 3 టీస్పూన్ల గంధపు పొడి

Also Read: CWC Qualifiers 2023: వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ.. జింబాబ్వే ప్లేయర్ అరుదైన రికార్డు!
చందనం ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి? (How To Make Chandan Face Pack) :
చందనం ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 3 స్పూన్ల గంధపు పొడి వేయాలి. ఆ తరువాత 1 విటమిన్-ఇ క్యాప్సూల్‌ను పగలగొట్టి గంధపు పొడిలో వేయాలి. ఆపై 2-3 స్పూన్ల రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. అంతే.. గంధపు ఫేస్ ప్యాక్ రెడీ.

చందనం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి? (How To Apply Chandan Face Pack):
చందనం ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మీరు సిద్ధం చేసుకున్న ప్యాక్‌ని ముఖంపై బాగా అప్లై చేయండి.
సుమారు 20 నిమిషాల తర్వాత పత్తి మరియు సాధారణ నీటి సహాయంతో శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2-3 సార్లు ప్రయత్నించండి. దాంతో మీ ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Also Read: DRDO Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 181 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Show comments