NTV Telugu Site icon

Selfy Psychology: మీరు ఏ చేత్తో సెల్ఫీ తీసుకుంటారు

This Will Have Them Surprised

This Will Have Them Surprised

ఈమధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు సెల్ఫీలు తీసుకుంటూ వుంటారు. అయితే వీరిలో అధిక భాగం ఏ చేత్తో సెల్ఫీలు తీసుకుంటారో తెలుసా? కుడిచేయి.. Right Hand is always Right అన్నట్టుగా వుంటుంది. ఎక్కువమంది అమ్మాయిలు తమ కుడిచేతి వైపు నుంచే సెల్ఫీలు తీసుకోడానికి ఇష్టపడతారని సర్వేలో తేలింది. ఎందుకంటే కుడివైపు నుంచి తీస్తే తమ కురులు, పాయలు మంచి యాంగిల్లో కనిపిస్తాయని చెబుతారు. ఫోటోలు తీసుకునేటప్పుడు కూడా ఇదే ఫాలో అవుతారని తెలుస్తోంది.

23శాతం మంది అమ్మాయిలు కుడిచేతి వైపు నుంచి తీస్తే తమ సెల్ఫీ చూడచక్కగా వస్తుందని చెప్పారు. 20శాతం మంది ఎడమవైపు నుంచి తీసుకోడానికి మొగ్గుచూపారు. 16 శాతం మంది అమ్మాయిలు ఏ వైపు నుంచి తీసుకున్నా తాము బాగుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. సెల్ఫీల కోసం అమ్మాయిలు ఎక్కువ శాతం అమ్మాయిల్లో ఒత్తిడి పెంచుతోందని కూడా విషయం కూడా ఈ సర్వేలో వెల్లడయింది. సోషల్ మీడియాలోకి పంపే ముందు వంద రకాలుగా తమ ఫొటోలు తీసుకుని గాని ఒకటి సెలెక్ట్ చేయరు అమ్మాయిలు… సెలక్షన్ కోసం ఎంత సమయమయినా వెచ్చిస్తారు అమ్మాయిలు.

Read Also: Vemula Prashanth Reddy: అక్బరుద్దీన్ మీ సహనం తగ్గిపోతుంది

స్మార్ట్‌ఫోన్‌లు మరియు సోషల్ మీడియాలు సెల్ఫీలకు డిమాండ్ పెంచేశాయి. సెల్ఫీలు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి. కీలకమైన వాటిలో ఒకటి స్వీయ ప్రదర్శనే అని చెప్పాలి. అవి మనం ఎవరో లేదా మనం ఎలా ఉండాలనుకుంటున్నామో సూచించడానికి నిర్దిష్ట మార్గాల్లో మనల్ని మనం ఇతరులకు ఎంపిక చేసుకునే మార్గం. అవి ఇంప్రెషన్ మేనేజ్‌మెంట్ కోసం ఒక సాధనం, ఇతరులు మనల్ని ఎలా చూస్తారో తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది మంచి సెల్ఫీ. సోషల్ మీడియాలో సెల్ఫీలను పోస్ట్ చేసిన తర్వాత తోటివారి నుండి స్వీకరించే అభిప్రాయం ఒకరి స్వీయ-భావనను బలోపేతం చేసే మార్గంగా ఉపయోగపడుతుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తేలింది.

మగవారి కంటే ఆడవారు ఎక్కువ సెల్ఫీలు పోస్ట్ చేస్తారు మరియు ఎక్కువ సెల్ఫీ-ఎడిటింగ్ చేస్తారు. కౌమారదశలో ఉన్నవారిపై అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో, ఆడవారు సెల్ఫీలకి ఎక్కువ టైం కేటాయిస్తారు. (సెల్ఫీలను ఎంచుకోవడం మరియు వాటిని ఎడిట్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారని పరిశోధనలో తేలింది. మగవారితో పోలిస్తే పీర్ ఫీడ్‌బ్యాక్‌పై మహిళలు టెన్షన్ పడతారు. ఆడవారు కూడా చాలా పొగిడే విధంగా పోజులివ్వడానికి ప్రయత్నిస్తారు. తమ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పోస్టు చేస్తారు. 18-40 సంవత్సరాల వయస్సు గల అమెరికన్ మగవారిపై జరిపిన ఒక అధ్యయనంలో, సెల్ఫీలను తీసుకోవడం, వాటిని సవరించడంపై అంతగా శ్రద్ధ చూపరు. సెల్ఫీలు తీసుకోవడం తప్పుకాదు కానీ, ఆ సెల్ఫీల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం మంచిదికాదు. మగవారు ఏ చేత్తో అయినా సెల్ఫీలు తీసుకుంటుంటారు.

<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>

Read Also: Karnataka Polls: కర్ణాటక ఎన్నికలకు బీజేపీ సారథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్