NTV Telugu Site icon

Red Grapes Benefits: ఎరుపు ద్రాక్షాల వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. అస్సలు వదలరు..

Red Grapes

Red Grapes

రోజూ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. అందులో ద్రాక్షలను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ద్రాక్షాలు నలుపు, ఆసుపచ్చ మాత్రమే కాదు ఎరుపు ద్రాక్షాలు కూడా ఉన్నాయి.. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎర్ర ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో ఎర్ర ద్రాక్ష ఎక్కువగా పండిస్తారు. వీటి నుంచి రెడ్ వైన్ తయారు చేస్తారు. కానీ మన దేశంలో ఎర్ర ద్రాక్ష చాలా తక్కువగా మాత్రమే లభ్యమవుతాయి. ఎర్ర ద్రాక్షలోనో పోషకాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి.. వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈరోజుల్లో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది.. బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర ద్రాక్ష మేలు చేస్తుంది. ఎర్ర ద్రాక్షలో తగినంత ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా ఎక్కువ సేపు ఆకలి అనిపించకుండా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఎర్ర ద్రాక్షలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రెడ్ గ్రేప్ జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

ఎర్ర ద్రాక్షలో తగినంత మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఎర్ర ద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను పెంపును నివారిస్తుంది..

ఈ ద్రాక్షాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎర్ర ద్రాక్షలో ఉండే ఫ్లేవనాయిడ్లు కంటి కణాలకు విశ్రాంతినిస్తాయి.. చర్మ నిగారింపు కూడా పెరుగుతుంది..

వీటిని రోజూ తీసుకోవడం వల్ల అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ఎర్ర ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త నాళాలను సడలించడం, గుండె కండరాలలో ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది… ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments