Red Grapes Benefits: ఎరుపు ద్రాక్షాల వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. అస్సలు వదలరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజూ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. అందులో ద్రాక్షలను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ద్రాక్షాలు నలుపు, ఆసుపచ్చ మాత్రమే కాదు ఎరుపు ద్రాక్షాలు కూడా ఉన్నాయి.. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎర్ర ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో ఎర్ర ద్రాక్ష ఎక్కువగా పండిస్తారు. వీటి నుంచి రెడ్ వైన్ తయారు చేస్తారు. కానీ మన దేశంలో ఎర్ర ద్రాక్ష చాలా తక్కువగా మాత్రమే లభ్యమవుతాయి. ఎర్ర ద్రాక్షలోనో పోషకాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి.. వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈరోజుల్లో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది.. బరువు తగ్గాలనుకునే వారికి ఎర్ర ద్రాక్ష మేలు చేస్తుంది. ఎర్ర ద్రాక్షలో తగినంత ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా ఎక్కువ సేపు ఆకలి అనిపించకుండా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఎర్ర ద్రాక్షలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రెడ్ గ్రేప్ జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..
Also Read
- Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
- Psychology facts: అర్థరాత్రి.. నిద్రపోని మనసు.. సముద్రంలో అలల్లా ఎగసిపడుతున్న ఆలోచనలకు కారణం ఇదే!
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ఎర్ర ద్రాక్షలో తగినంత మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఎర్ర ద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెరను పెంపును నివారిస్తుంది..
ఈ ద్రాక్షాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎర్ర ద్రాక్షలో ఉండే ఫ్లేవనాయిడ్లు కంటి కణాలకు విశ్రాంతినిస్తాయి.. చర్మ నిగారింపు కూడా పెరుగుతుంది..
వీటిని రోజూ తీసుకోవడం వల్ల అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ఎర్ర ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్త నాళాలను సడలించడం, గుండె కండరాలలో ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది… ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!