NTV Telugu Site icon

Red Banana : ఎర్ర అరటిపండ్లను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారు..

red banana

red banana

అరటిపండ్లు మూడు రకాలు ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు.. ఎర్రనివి, ఆకు పచ్చనివి, పసుపు పచ్చనివి.. ఈరోజు మనం ఎర్రని అరటిపండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వీటిలో సహజ చక్కరలు అధికంగా ఉంటాయి.. ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటివి ఉంటాయి.. అందుకే వీటిని తిన్న వెంటనే శక్తి వస్తుంది..
* ఎర్ర అరటిపండులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్, ఆంథోసైనిన్లు, డోపమైన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి.. క్యాన్సర్ కణాలను నయం చేసే గుణాలు ఉంటాయి.. దీర్ఘ కాలిక వ్యాధులను కూడా నయం చేస్తుంది..
* విటమిన్ సి, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండే ఎర్రటి అరటిపండ్లు మంచి యాంటీఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..
* కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మచ్చలు కూడా పోతాయి.. అలాగే కంటి సమస్యలు దూరం అవుతాయి..
* అంతేకాదు వీటిలో పుష్కలంగా పోటాషియం ఉంటుంది.. ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచేందుకు సహాయపడుతుంది..
* అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీ కంటెంట్ కారణంగా, ఎర్రటి అరటిపండ్లు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తాయి.. దీంతో అతిగా తినడం తగ్గిస్తారు.. త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఇంకా ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.