Site icon NTV Telugu

Alcohol Effects: జస్ట్ 21 రోజులు మద్యం మానేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Alcohol

Alcohol

రోజులు గడుస్తున్న కొద్దీ యువతలో మద్యం సేవించే ట్రెండ్ పెరుగుతోంది. పండుగల సీజన్ అయినా, కొత్త సంవత్సర వేడుకలైనా సరే, మద్యం, బీరు లేదా ఇతర మద్య పానీయాలు తీసుకునే ట్రెండ్ కూడా పెరుగుతోంది. ఆధునిక కాలంలో ప్రజల సంతోషకరమైన వేడుకల్లో మద్యపానం ఒక ముఖ్యమైన భాగంగా మారింది.
రోజూ మద్యానికి బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ, అతిగా మద్యం సేవించడం క్యాన్సర్, కాలేయ వైఫల్యంతో సహా అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. అయితే.. రోజూ మద్యం సేవించే వాళ్లు ఓ 21 మానేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Suhas : సినిమా తీయడం రాదని అవమానించారు.. సుహాస్ ఎమోషనల్..

21 రోజులు మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ఆకలి పెరుగుతుంది. మీరు ఆల్కహాల్ కంటే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. మీకు రుచికరమైనది తినాలనే కోరిక ఉంటుంది. చాలా ఆరోగ్యంగా ఉంటారు. మందు కొట్టి నిద్రపోతే చెత్త పీడకలలు వస్తాయి. కానీ మందు కొట్టకపోతే అలాంటి కలలు రావు. కలలు చాలా ఆహ్లాదకరంగా మారతాయి. అయితే నిత్యం మందు తాగేవారికి 21 రోజుల పాటు దీన్ని నివారించడం కాస్త కష్టమే. ఇది చాలా మందిలో నిద్రలేమిని కూడా కలిగిస్తుంది. అయితే మద్యం ఎక్కువగా తాగినా నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. మందు 21 రోజులపాటు మానేస్తే.. మొదటి వారంలో తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కాలేయం కొద్దికొద్దిగా శుభ్రపరచడం ప్రారంభమవుతుంది. జీర్ణసమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.

READ MORE: Andhra King Thaluka : రామ్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ కొత్త షెడ్యూల్.. అక్కడే..

మద్యపానం 21 రోజులు ఆపేస్తే.. మీ ముఖంలో చాలా మార్పులు మొదలవుతాయి. గతంలో ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండదు. కానీ తాగడం ఆపిన మొదటి వారం తర్వాత సాధారణ రక్తస్రావం ఉంటుంది. ఇది ముఖం ముడతలు, నల్ల మచ్చలు మొదలైన వాటిని కూడా నివారిస్తుంది. మద్యం సేవించడం మానేస్తే.. దెబ్బతిన్న కాలేయాన్ని సరిచేయవచ్చు. నిత్యం ఆల్కహాల్ తీసుకుంటే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రమంగా కాలేయం క్షీణించడం మొదలవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు నియంత్రంచుకొని.. మందు తాగడం తగ్గించుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఇలా చేయడం వల్ల మీ కాలేయం తిరిగి సాధారణ స్థితికి రావచ్చు. ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థను పాడు చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీంతో మీరు అనారోగ్యంతోపాటు ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. మీరు ఆల్కహాల్ తాగడం మానేస్తే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆల్కహాల్ కు మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. మద్యం తాగడం మానేస్తే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

Exit mobile version