తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంటినుంచి బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇప్పటికే చలి పెరిగిపోగా, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరుస్తున్నా.. మరోవైపు పొగ మంచుతో వాహనదారులకు ఇబ్బందులు కలగనున్నాయి. దట్టమైన పొగమంచుతో ఊరేదో.. అడవేదో.. రోడ్డేదో.. చెట్టేదో తెలియకుండా పోతోంది. ఈ ఏడాది.. నగరాలను సైతం మంచుదుప్పటి కప్పేస్తోంది. అయితే.. ఈ పొగ మంచులో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
READ MORE: Allu Arjun : ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో ‘పుష్ప 2’
వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సొంత కార్లు, ద్విచక్రవాహనాలపై అర్ధరాత్రి, తెల్లవారుజాముల ప్రయాణాలు వీలైనంత మేర సాగించకుడదు. ఉదయం 8గంటలు దాటిన తర్వాత సొంత వాహనాల్లో ప్రయాణాలు మొదలు పెట్టాలి. మంచు పడుతున్నప్పుడు ఫాగ్‌లైట్స్ తప్పనిసరిగా ఉపయోగించాలి. కొన్ని సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించవు. అలాంటప్పుడు అతివేగంతో వాహనం అస్సలు నడపకూడదు. ఒక్కోసారి రోడ్డుపై వాహనం జారిపడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
పరిమిత వేగంలో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే కనీసం 50 అడుగుల దూరంలో వాహనం ఆగుతుంది. అతి వేకంగా ఉన్నప్పుడు 90 అడుగుల దారంలో నిలుస్తాయి. అకస్మాత్తుగా బ్రేకలు వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
READ MORE: IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు వర్ష సూచన..! పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే..?
కాబట్టి సాధారణ వేగంలోనే వీలైనంత వరకు వాహనాలు నడపాలి అప్పుడే నియంత్రణ సాధ్యమవుతుంది.
మంచు సీజన్‌లో వాహన సామర్థ్యం సరిగా ఉండేలా చూసుకోవాలి. వైపర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? బ్రేకులు సమస్యల్లేకుండా ఉందా అని చెక్ చేసుకోవాలి?
కారులో వెళ్లేటప్పుడు హీటర్ ఉపయోగించాలి. దీనివల్ల ముందు అద్దాలు ఆవిరిపట్టకుండా ఎదుటి వాహనాలను సరిగ్గా గమనించేందుకు వీలు ఉంటుంది.
ఒకవేళ దట్టమైన మంచుతో ముందుగు సాగలేని పరిస్థితి ఉంటే రోడ్ బేలు, పెట్రోల్ బంకుల వద్ద ఆగడం మంచిది.