Site icon NTV Telugu

Prawns Biryani: 15 నిమిషాల్లోనే రొయ్యల బిర్యాని రెడీ..

Prawn Biryani

Prawn Biryani

రొయ్యలను కూడా ఎక్కువగా తింటారు.. చేపల కన్నా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.. రొయ్యలతో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. వేపుళ్ళు, కూరలు, పచ్చళ్ళు కూడా పెడతారు.. ఏది పెట్టినా ఎలా చేసిన టేస్ట్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదు..రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల బిర్యానీ కూడా ఒకటి. రొయ్యల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే రొయ్యల బిర్యానీ రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయాలంటే చాలా మంది శ్రమతో, ఎక్కువ సమయంతో కూడుకున్న పని అని దీనిని ఇంట్లో తయారు చెయ్యరు..ఈరోజు మనం చాలా సింపుల్ గా రొయ్యల బిర్యానిని ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

బియ్యం – 2 గ్లాసులు,

నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్,

నూనె – 2 టేబుల్ స్పూన్స్,

నల్ల యాలకులు – 2,

యాలకులు – 3,

లవంగాలు – 5,

దాల్చిన చెక్క – ఇంచు ముక్క,

జాపత్రి – కొద్దిగా,

అనాస పువ్వు – 1,

సాజీరా – అర టీ స్పూన్,

బిర్యానీ ఆకులు – 2,

స్టోన్ ప్లవర్ – కొద్దిగా,

పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు,

తరిగిన టమాటాలు – 2,

కారం – 2 టీ స్పూన్స్,

బిర్యానీ మసాలా – ఒక టీ స్పూన్,

గరం మసాలా -ఒక టీ స్పూన్,

ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్,

తరిగిన పుదీనా 2 టేబుల్ స్పూన్స్,

తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్,

నీళ్లు – 3 గ్లాసులు..

మ్యారినేషన్ కూడా చేసుకోవాలి..

తయారీ విధానం :

ముందుగా రొయ్యలను బాగా క్లిన్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని రొయ్యలల్లో వేసి కలపాలి. అలాగే మిగిలిన పదార్థాలు కూడా వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు రొయ్యలను మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న రొయ్యల మసాలాలను అందులో వేసుకోవాలి..ఆ తరువాత బియ్యం, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. మసాలాలు మాడిపోకుండా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి.. తర్వాత బాగా కలిపి బిర్యానికి తగినన్ని నీళ్లు పోసి విజిల్ కుక్కర్ మూత పెట్టాలి..ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పెద్ద మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి అంతా కలుపుకుని మరో 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ రొయ్యల బిర్యానీని ఉల్లిపాయ వేసుకొని సర్వ్ చేసుకుంటే సరి.. రొయ్యల బిరియాని రెడీ అయ్యినట్లే..పెరుగు చట్నీతో తీసుకుంటే ఇంక సూపర్ అంతే.. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Exit mobile version