NTV Telugu Site icon

Potato Peel: ఆలూ తొక్కను పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు వదలరు..

Pp

Pp

మనం ఎక్కువగా వండుకొనే కూరల్లో ఆలూ కూడా ఒకటి.. చాలా మంది వారానికి ఒకసారైనా దీన్ని చేసుకుంటారు.. రుచిగా వుంటుంది.. స్నాక్స్ ఎక్కువగా చేసుకుంటారు.. అయితే చాలా మంది వండే టప్పుడు ఆలూ తొక్కను తీసీ వండుతారు.. అలా చెయ్యడం వల్ల చాలా పోషకాలు లాస్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆలూ తొక్కలో ఎటువంటి పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: Doctor Ravali: 5 నిమిషాలు సీపీఆర్ చేశా.. పిల్లాడి ప్రాణం కాపాడటం ఆనందంగా ఉంది..

పొట్టు మీద అంతా మట్టి, దుమ్ము ఉంటాయి కనుక పొట్టును తప్పనిసరిగా తీసేయాల్సి వస్తుంది. అయితే వాస్తవానికి ఆలూను పొట్టుతో సహా తినాల్సిందేనట.. పొట్టులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది. ఈ పొట్టులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. అందువల్ల ఈ పొట్టు హైబీపీ ఉన్నవారికి వరమనే. ఈ తొక్కలో పోటాషియం కూడా అధికంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి.. గుండె జబ్బులు, క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.. ఆర్థరైటిస్‌, కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు.. అలాగే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు..