NTV Telugu Site icon

Pomegranate: దానిమ్మ గింజలను రాత్రి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Pomegranate

Pomegranate

దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..దాదాపు సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తూ ఉంటాయి. దానిమ్మగింజలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొందరు దానిమ్మ గింజలను తింటే కొందరు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అయితే దానిమ్మను రాత్రి పూట కూడా తీసుకోవచ్చా అనేది చాలా మందికి వచ్చే డౌట్.. ఈరోజు మనం దానిమ్మను ఎప్పుడు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

దానిమ్మగింజల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. దానిమ్మ గింజలను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ గింజలను జ్యూస్ గా చేసి తీసుకుంటే మాత్రం వీటిలో ఉండే ఫైబర్ మన శరీరానికి అందదు.. అందుకే గింజలుగా తీసుకోవడం మంచిది..

ఇకపోతే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలోరోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు, సంతానలేమి సమస్యలతో బాధపడే వారు దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.. దానిమ్మ గింజలను రాత్రి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. రాత్రి దానిమ్మ గింజలల్లో పెరుగు కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది..ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ లో ఒక టీ స్పూన్ అల్లం రసం వేసి కలపాలి. ఈ జ్యూస్ ను రాత్రి పూట పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి.. ఇక ఆలస్యం ఎందుకు మీకు ఇటువంటి సమస్యలు ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

 

Show comments