హోలీ అంటే రంగుల పండుగ.. మన దేశం మొత్తం సంబరంగా జరుకొనే పండుగ హోలీ.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా హోలీని జరుపుకుంటారు.. హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు కానీ ఈ రంగులు శరీరం పై బట్టల పై పడితే సామాన్యంగా పోవు.. ఇప్పుడు వస్తున్న రంగులు రసాయనాలమయం అయిపోయాయి.. వాటిలో ఎక్కువగా రసాయనాలు ఉండటం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి..
హోలీ ఆడినప్పుడు ముఖం మీద రంగులు ఉంటే అదే పనిగా సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో కడుక్కోకూడదు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి.. ఎక్కువగా ముఖాన్ని రుద్దకుండా కొంచెం కొబ్బరి నూనె, లేదా నెయ్యిని అప్లై చేసుకోవడం మంచిది.. రంగుల కారణంగా చర్మం పొడి బారకుండా ఉంటుంది..
హోలీ ఆడటానికి ఒక గంట ముందు కొబ్బరి నూనెతో ముఖాన్ని మసాజ్ చేయండి. దీనితో మీ గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. మీరు మంచి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి, బాదం,లేదా ఆలీవ్ నూనె, నువ్వుల నూనె బాగా పూసుకోవాలి.. అప్పుడే రంగులు పడినా పెద్దగా అంటుకోవు..
రంగులు శరీరానికి అంటుకోకుండా ఉండేందుకు లోషన్స్ రాయాలి.. కనురెప్పలు, మీ కళ్ల చుట్టూ ఉన్న ప్రదేశంలో కొంచెం ఎక్కువ మాయిశ్చరైజర్‌ని అప్లయ్ చేసుకోండి. కళ్లకు అద్దాలు పెట్టుకుని బయటకు వెళ్లండి.. అప్పుడే ఆ రంగులు ముఖం మీద పడకుండా ఉంటాయి.. అలా ఫుల్ గా బట్టలు వేసుకోవడం , చెప్పులను వేసుకోవడం మర్చిపోకండి..రంగుల నుంచి కొంతవరకు మన చర్మాన్ని రక్షించుకోవచ్చు.. గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులను ఎట్టి పరిస్థితులలో వాడకూడదు.. ఇవన్నీ గుర్తుంచుకొని హోలీని ఆడటం మంచిది..