Paracetamol Pregnancy Safety: గర్భిణీలు పారాసెటమాల్ వాడితే ప్రమాదమా? ట్రంపరితనంలో నిజమెంత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paracetamol Pregnancy Safety: అగ్రరాజ్యాధినేతగా ఎప్పుడూ వార్తల్లో నిలవడం డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటు అయిపోయింది. తాజాగా ఆయన గర్భిణీలు పారాసెటమాల్ వాడితే ప్రమాదం అనే వాదనను తీసుకొచ్చారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు గర్భిణీలు పారాసెటమాల్ వాడటంపై పెద్ద వివాదం చెలరేగుతుంది. అమెరికాలో పారాసెటమాల్ టైలెనాల్ అనే బ్రాండ్ పేరుతో చెలామణి అవుతుంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టైలెనాల్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఆటిజం ప్రమాదం పెరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భిణీలు ఈ మందులు తీసుకోవడం కారణంగా పుట్టబోయే పిల్లలలో ఆటిజం రావచ్చని పేర్కొన్నారు. ఇంతకీ మనోడి వాదనలో నిజం ఎంత? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: OG : ఎట్టకేలకు కంటెంట్ ఇచ్చేశారు !
Also Read
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
శాస్త్రీయ ఆధారాలు లేవు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాజీ చీఫ్ సైంటిస్ట్.. ప్రఖ్యాత శిశువైద్యురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలపై స్పందించారు. పారాసెటమాల్ సురక్షితమైన, ప్రభావవంతమైన మందు అని స్పష్టం చేశారు. పారాసెటమాల్ తయారీదారులు, అంతర్జాతీయ వైద్య సంస్థలు గర్భిణీ, పాలిచ్చే మహిళలకు పారాసెటమాల్ సురక్షితమైనదని, కానీ వైద్యుడి మార్గదర్శకత్వంలో మాత్రమే తీసుకోవాలని పేర్కొంటున్నట్లు తెలిపారు. పారాసెటమాల్-ఆటిజం మధ్య ఎటువంటి సంబంధాన్ని సమర్ధించడానికి ప్రస్తుతం ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు స్పష్టం చేశారు.
పారాసెటమాల్ టైలెనాల్ అనే బ్రాండ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగంలో ఉంది. ఈ మందు నొప్పి నివారిణిగా, జ్వరం తగ్గించేదిగా పనిచేస్తుంది. దీనిని సాధారణంగా తలనొప్పి, వెన్నునొప్పి, చిన్న ఆర్థరైటిస్ నొప్పి, కండరాల నొప్పులు, పంటి నొప్పులు వంటి వాటికి, అలాగే తాత్కాలికంగా జ్వరాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. పలువురు పిల్లల వైద్యులు మాట్లాడుతూ.. పారాసెటమాల్ అత్యంత సురక్షితమైన మందులలో ఒకటి అని చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవడంలో ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు. ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టుల సమాఖ్య (FIGO) దీని వాడకాన్ని సిఫార్సు చేస్తుంది.
ట్రంప్ వాదనలో నిజం ఎంత..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో.. గర్భిణీ స్త్రీలు టైలెనాల్‌ను నివారించాలని సూచించారు. ఇది పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. అయితే ఆయన తన ప్రకటనలో ఎలాంటి కచ్చితమైన శాస్త్రీయ డేటాను లేదా వైద్య అధ్యయనాలను ఉదహరించలేదు. ఆయన తన ప్రకటనలో“మహిళలు దీనిని తీసుకోకపోతే హాని లేదు” అని పేర్కొన్నారు. టైలెనాల్‌ను తయారు చేసే కంపెనీ ట్రంప్ వాదనను ఖండించింది. “ఇప్పటి వరకు ఉన్న అన్ని పరిశోధనలు, శాస్త్రీయ డేటా పారాసెటమాల్ ఆటిజం మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని చూపిస్తుంది” అని స్పష్టం చేసింది.
పూర్తిగా సురక్షితం అయినా..
పారాసెటమాల్‌ను జ్వరం, ఇతరల నొప్పులను తగ్గించడానికి సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైద్యులు కామన్ రాసే మందులలో ఇది ఒకటి అని పలువురు వైద్యులు పేర్కొన్నారు. కండరాల బెణుకులు, తలనొప్పి, వెన్నునొప్పి, పంటి నొప్పులతో సహా అన్ని రకాల నొప్పులకు ఇది ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపారు. అన్ని ఔషధం లాగానే పారాసెటమాల్‌ను అధికంగా వాడటం, దీర్ఘకాలికంగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినడం వంటి హాని కలుగుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో అవసరమైన సమయంలో వైద్యుడి సూచన మేరకు ఉపయోగిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
READ ALSO: IRCTC Special Navratri Menu: నవరాత్రి స్పెషల్.. రైల్వేలో కొత్త మెనూ
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!