NTV Telugu Site icon

Pan Fried Chicken: చికెన్ తక్కువ.. ప్రొటీన్ ఎక్కువ..

Pan Fried Chicken

Pan Fried Chicken

Pan Fried Chicken: ఈరోజు మనం మంచి ప్రొటీన్‌ కోసం ‘పాన్‌ ఫ్రైడ్‌ చికెన్‌ విత్‌ వెజ్జీస్‌’ని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సినవి.. మూడు రకాల క్యాప్సికం, బ్రొకోలి, చికెన్‌ బ్రెస్ట్‌, నూనె. శనగ నూనె గానీ కుసుమ నూనె గానీ నువ్వుల నూనె తీసుకోవచ్చు. ఇంకా.. సాల్ట్‌, పెప్పర్‌, చిల్లీ ఫ్లేక్స్‌, మస్టర్డ్‌ సాస్‌ కూడా తీసుకోవాలి. ముందుగా.. కూరగాయలను కట్‌ చేసి పెట్టుకోవాలి. గ్రీన్‌, ఎల్లో, రెడ్‌ కలర్‌ క్యాప్సికమ్‌లు, చికెన్‌ మరియు క్యాలీఫ్లవర్‌ను ఇలా చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.

అలాగే.. చిల్లీ ఫ్లెక్స్‌, ఉప్పు, మిరియాల పొడి, ఆవాల సాస్‌.. అన్నీ సిద్ధం చేసుకోవాలి. తర్వాత.. ఈ మసాలాలను మారినేట్‌ చేసుకోవాలి. అంటే.. చిక్కగా కలుపుకోవాలి. అనంతరం.. ఆ మిక్చర్‌.. చికెన్‌ ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఇలా పది నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. టేస్ట్‌ కోసం లెమన్‌ని కూడా కలుపుకోవచ్చు. ఈలోపు కూరగాయల ముక్కలను బాయిల్‌ చేసుకోవాలి. చాలా తక్కువ మంట పెట్టి నిదానంగా ఉడికించాలి. దీనికోసం నీళ్లను కొద్దిసేపు మరిగించాలి.

read more: Digital Payments: ఇండియాలో డిజిటల్‌ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు

ఆ వేడి నీళ్లలో కూరగాయల ముక్కలను వేసి కాసేపు ఉంచి తీయాలి. నీళ్లు మరిగేటప్పుడు కూరగాయల ముక్కలను వేయాలి. ఇది చాలా సింపుల్‌ ప్రాసెస్‌. నీళ్లు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. తక్కువైనా వేసుకోవచ్చు. కూరగాయల ముక్కలను ఉడికించిన తర్వాత టేస్ట్‌ రావటం కోసం ఏమేం చేయాలో చూద్దాం. ఆయిల్‌ లేదా వెన్న.. అది కూడా కొన్ని చుక్కలు మాత్రమే తీసుకోవాలి. అందులో కాసిన్ని వెల్లుల్లి ముక్కలు వేయాలి. ఆ తర్వాత.. కూరగాయల ముక్కలు కలపాలి.

వాటిని గరిటెతో ఒకటీ రెండు నిమిషాలు పాటు కలియ తిప్పాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది. ఉప్పు కొంచెం తక్కువ తీసుకోవటం మంచిది. ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. కూరగాయల ముక్కల మాదిరిగానే చికెన్‌ ముక్కలను కూడా ఫ్రై చేయటం కోసం 5 మిల్లీ లీటర్ల కన్నా తక్కువ నూనె తీసుకోవాలి. నూనె వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేయాలి. వాటిని మూడు, నాలుగు నిమిషాల తర్వాత మిక్స్‌ చేయాలి.

ఇలా రెండు మూడు సార్లు.. అంటే.. 12 నిమిషాల పాటు చేస్తే మనం అనుకున్న పాన్‌ ఫ్రైడ్‌ చికెన్‌ రెడీ అయిపోతుంది. దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారికి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల టేస్ట్‌ కూడా వస్తుంది. కావాలనుకుంటే నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు పైనుంచి. ఫైనల్‌గా గార్లిక్‌ చికెన్‌ విత్‌ పాన్‌ ఫ్రైడ్‌.. ఈవిధంగా నోరూరిస్తుంది.