Oral Cancer: రెండు గాజులు అమ్ముకోకండి..నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఏదైన సినిమాకు వెళ్తే చాలు సినిమాకు ముందు యాడ్స్ లో క్యాన్సర్ గురించి మన ముఖేష్ చెప్పిన వినుము. ఒక వ్యక్తి కాన్సర్ వల్ల తన రెండు గాజులు అమ్ముకున్నా గాని వినుము.. ఆఖరికి మన ది వాల్ రాహుల్ ద్రావిడ్ రన్ అవుట్ కాకండి ముర్రో అని ఎంత మొత్తుకున్న ఆబ్బె మనం మాత్రం వినుము. ప్రాణాన్ని నిలిపే డాక్టర్ల మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. క్యాన్సర్ జీవితాన్ని చిధ్రం చేస్తుంది. ముందుగా గుర్తిస్తే.. చికిత్స ఉంటుంది. ఆలస్యమైతే మాత్రం ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవల్సిందే. అది ఎలాంటి క్యాన్సరైనే సరే.. నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. అది మానసికంగానే కాదు, ఆర్థికంగా కూడా కుంగదీస్తుంది. అయితే, కొందరు తమ అలవాట్ల వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా సరే.. వెనక్కి తగ్గరు. పరిస్థితి చేయిదాటిపోయిన తర్వాత కుమిలిపోతారు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మన దేశంలో అత్యధిక ప్రజలు నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, వాటికి కారణం పొగాకు ఉత్పత్తులేనని వెల్లడించారు.
పురుషుల్లోనే అధికం:
Also Read
- Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
పాట్నాలోని AIIMSలో రేడియేషన్ ఆంకాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ శంకర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో అత్యధిక పురుషులు నోటి క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది ప్రధానంగా పొగలేని పొగాకు వాడకం వల్లే ఏర్పడుతుంది. మన దేశంలో మొత్తం పొగాకు ఉత్పత్తుల్లో సిగరెట్లు 5 శాతం, బీడీ 10 శాతం, పొగలేని పొగాకు 85 శాతం వరకు వినియోగంలో ఉన్నాయి’’ అని తెలిపారు.
పొగాకు నమలడం మరింత ప్రమాదకరం:
‘‘చాలామంది సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని భావిస్తున్నారు. పొగాకు నమలడం అంతకంటే ప్రమాదకరమైనదనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇండియాలో నోటి క్యాన్సర్లు అదుపులోకి రావాలంటే.. పొగాకు ఉత్పత్తుల నివారణ ఒక్కటే మార్గం’’ అని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాల ప్రకారం.. పొగాకు ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మంది ప్రాణాలు తీసుకుంటోంది. వీటిలో 7 మిలియన్లకు పైగా మరణాలు ప్రత్యక్షంగా పొగాకు వాడకం వల్ల చోటుచేసుకున్నాయి. చిత్రం ఏమిటంటే.. వీరిలో 1.2 మిలియన్ల మంది పొగ తాగకుండానే దాని ప్రభావానికి లోనై చనిపోయారు. అంటే, పొగాకు పొగ తాగేవారికే కాదు, పీల్చేవారికి కూడా ప్రమాదమే.
జీవితానికి ‘పొగ’ పెట్టొద్దు:
పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో పొగాకు అనేక రూపాల్లో లభిస్తోంది. సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ, అరేకా (బీటల్ క్విడ్) తినేవారు ఎక్కువగా నోటి క్యాన్సర్లకు గురవ్వుతున్నారు. మద్యం సేవించేవారు ఇతరాత్ర క్యాన్సర్లతో బాధపడుతున్నారు. పొగాకు వల్ల నోటిలో ఏ ప్రాంతమైనా ప్రభావితం కావచ్చు. నోటి కింది భాగం, పై భాగం లేదా పెదాలు, నాలుక, చిగుళ్లు, బుగ్గలు ఇలా ఎక్కడైనా క్యాన్సర్ ఏర్పడవచ్చు. నోటి క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స చేయొచ్చు. ముదిరితే మాత్రం పూర్తిగా నోటినే తొలగిస్తారు. కాబట్టి, ఇప్పటికైనా ఈ అలవాటు నుంచి బయటపడండి. వీలైతే డాక్టర్‌ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోండి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!