మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరమని వైద్యులు తెలుపుతున్నారు. ఆరోగ్యకరమైన శృంగారం మనిషిని అత్యంత ఉత్సహంగా ఉండేలా చేస్తోందట.. ప్రస్తుతం సమాజంలో ఉన్న చాలామందికి శృంగారం గురించి, దానివలన కలిగే లాభాల గురించి తెలియదని నిపుణుల సర్వేలో తేలింది. తమ భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడం కొంతమంది ఎంజాయ్ చేస్తారు.. ఇంకొంతమంది ఏదో చేయాలి కాబట్టి చేస్తుంటారని ఆ సర్వేలో తేలింది. ఇంకొంతమంది రతి సమయంలో అతి చేస్తారని తేలింది. అలా అతి చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు తెలుపుతున్నారు. సాధారణంగా చాలామంది దంపతులు శృంగారం చేసేట్టప్పుడు పెట్రోలియం జెల్లీని వాడుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని ప్రముఖ గైనకాలజిస్టులు పేర్కొంటున్నారు.
ఆడవారి జననాంగాలు వదులుగా అవ్వడానికో లేదా బిగుతుగా చేయడానికో పెట్రోలియం జెల్లీని వాడుతుంటారు. అలా వాటిని వాడినప్పుడు వాటిలో ఉన్న బ్యాక్టీరియా శరీరంలోపల ప్రవేశించి అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోందని గైనకాలజిస్టులు తెలుపుతున్నారు. సాధారణంగా స్రవించే స్రవాలు కాకుండా అతిగా కావాలని చాలామంది లూబ్రికెంట్ గా బాడీ లోషన్స్, పెట్రోలియం జెల్లీలు, ఆలివ్ ఆయిల్ లాంటివాటిని వాడతారు.. ఇలాంటి అసహజమైన సెక్స్ వలన సుఖాన్ని ఎక్కువగా పొందలేరని వైద్యులు తెలుపుతున్నారు. అంతగా లూబ్రికెంట్ వాడాలనుకుంటే వాటికి తగ్గ కండోమ్స్ ని ఉపయోగించుకోవచ్చని, అది ఆరోగ్యకరమైనదని సలహా ఇస్తున్నారు. రతిలో అతిగా పాల్గొనడం మంచిదే కానీ ఇలా అసహజమైన పద్దతిలో పాల్గొంటే లేనిపోని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు.