Site icon NTV Telugu

Newborn Baby Care: ఈ చిన్న తప్పులు మీ పసిబిడ్డకు పెద్ద ప్రమాదం కావచ్చు.. డాక్టర్‌ల వార్నింగ్

Newborn Babu Care

Newborn Babu Care

నవజాత శిశువుల ఆరోగ్యం అత్యంత సున్నితంగా ఉంటుంది, అందుకే వారి విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. పసిబిడ్డల రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, అందుకే తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని గైనకాలజిస్ట్ డాక్టర్ లు స్పష్టం చేశారు. ముఖ్యంగా పుట్టిన వెంటనే శిశువులకు గుజ్జు, తేనె లేదా బెల్లం వంటివి తినిపించడం వల్ల వారి జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అలాగే, ఒక సంవత్సరం వయసు నిండకుండా పిల్లలకు ఆవు పాలు పట్టడం సురక్షితం కాదని తెలిపారు. అంతే కాదు

Also Read : Sankranthi : సంక్రాంతి ఎన్ని రోజుల పండుగ? ‘కనుమ నాడు కాకైనా కదలదు’ వెనుక అసలు కారణం ఇదే!

సంప్రదాయం పేరుతో పిల్లల కళ్లకు కాజల్, సుర్మా పూయడం లేదా వారి చెవిలో నూనె వేయడం వంటి పద్ధతులు ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని, వాటిని వెంటనే మానుకోవాలని డాక్టర్ సూచించారు. పసిబిడ్డల శరీరానికి గట్టిగా మసాజ్ చేయడం కూడా ప్రమాదకరమని, వారి ముఖం లేదా పెదవులపై ముద్దు పెట్టుకోవడం వల్ల బయటి బ్యాక్టీరియా వారికి సులభంగా సోకుతుందని ఆమె వివరించారు. తల్లిపాలు ఇచ్చిన ప్రతిసారీ బిడ్డకు భుజం పై వేసుకుని, వారి వీపు మీద చిన్నగా తడమటం ద్వారా గ్యాస్ సమస్యలను నివారించవచ్చని డాక్టర్‌లు పేర్కొన్నారు. పసిబిడ్డల సంరక్షణలో ఇటువంటి ప్రాథమిక నియమాలు పాటించడం వల్ల వారిని అనారోగ్యం నుండి కాపాడుకోవచ్చని డాక్టర్‌లు సూచించారు.

Exit mobile version