NTV Telugu Site icon

Myth N Fact: గుక్క పట్టి ఏడ్చే పిల్లలకు గ్రైప్‌ వాటర్‌ పట్టించడం రైటా? రాంగా?

Myth N Fact

Myth N Fact

Myth N Fact: మన ఇంట్లో చిన్న పిల్లలు అప్పుడప్పుడూ లేదా వరుసగా కొన్ని రోజుల పాటు రోజులో కొద్దిసేపు గుక్క పట్టి ఏడుస్తుంటారు. తద్వారా వాళ్లు తమ బాధను బయటికి చెప్పుకోలేక తమలోతామే తీవ్రంగా ఇబ్బందిపడటం జరుగుతుంటుంది. అలా తల్లడిల్లిపోతున్న చిన్నారులను చూసి వాళ్ల తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. పసికందులు ఎందుకు అలా ఏడుస్తున్నారో అర్థంకాదు. ఆ సందర్భంలో ఏం చేయాలో కూడా తోచదు. అందువల్ల.. కొంత మంది హాస్పిటల్‌కి వెళుతుంటారు.

మరికొంత మంది.. వాళ్లకు తెలిసిన నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. అందులో.. గ్రైప్‌ వాటర్‌(చంటిపిల్లల కడుపునొప్పికి మందు) పట్టడం కూడా ఒకటి. అయితే.. ఇది సరైన చర్యేనా? కాదా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ‘ఎన్టీవీ లైఫ్’.. Myth N Fact పేరిట ప్రజల సందేహాలను నివృత్తి చేస్తోంది. కాబట్టి.. పిల్లలకు గ్రైప్ వాటర్ పట్టడం మంచిదా? కాదా? అనేది డాక్టర్ మాటల్లోనే వినండి. ఆ వీడియో ఈ కిందే ఉందని గమనించగలరు.