NTV Telugu Site icon

Monsoon Tips : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం కోసం అద్భుతమైన చిట్కాలు..!

Rainy Season

Rainy Season

వర్షాలు మొదలైయ్యాయి.. ఇక సీజనల్ వ్యాదులు కూడా మొదలైయ్యాయి.. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం అనేక రకాల జబ్బులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల సమస్యలు పెరుగుతాయి. వర్షకాలంలో పిల్లలకు పరిశుభ్రత పద్ధతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాల్సిన అవరం ఉంది. వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వానాకాలంలో పిల్లల ఆరోగ్యం కోసం చిట్కాలు..

*.వర్షాకాలంలో పిల్లలకు శుద్ధి చేసిన తాగునీరు, మరగించి చల్లార్చిన నీరు తాగేలా చూసుకోండి.. *.మలేరియా, డెంగ్యూ ఇతర వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి దోమల వృద్ధిని నివారించడానికి పరిసరాలను శుభ్రంగా ఉంచండి..
*. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి తడి బట్టలు, బూట్లు తప్పనిసరిగా ఆరుబయట ఆరబెట్టాలి..
*. పిల్లలు భోజనానికి ముందు చేతులు బాగా కడుక్కునేలా ప్రోత్సహించండి…
*. స్కిప్పింగ్, హోపింగ్, టేబుల్ టెన్నిస్ మొదలైన ఇండోర్ ఫిజికల్ యాక్టివిటీస్ వంటి శారీరక శ్రమ కలిగించే క్రీడలను ప్రోత్సహించండి..
*. పాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లను ఎంతవరకు తగ్గిస్తే అంతమంచిది..
*. శరీరంపై టాల్కమ్ పౌడర్ రాసుకోవాలి
*. వర్షాలు పడుతున్న సమయంలో రెయిన్‌కోట్‌లు, గొడుగులు, గమ్ బూట్లు ఉపయోగించండి.
*. ఆహారంలో తులసి, దాల్చిన చెక్క, నిమ్మ, అల్లం మరియు ఇతర మసాలా దినుసులు చేర్చండి. వీటిలో జ్వరాన్ని నివారించడంలో , ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి..
*. పిల్లలు బయటకు వెళ్లినప్పుడు పొడవాటి చేతుల దుస్తులు, పూర్తి పొడవు కలిగిన ప్యాంటులను వేసుకునేలా చూడండి. దోమలు కుట్టకుండా అవసరమైతే, దోమతెర ఉపయోగించండి..
*.. పిల్లలను బయటి నుండి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో వారి పాదాలను కడగమని చెప్పండి. ప్లాస్టిక్, కాన్వాస్ లేదా లెదర్ బూట్లు ధరించడం మానుకోండి. సాధారణ చెప్పులు ధరించమని చెప్పండి.
*.పిల్లలు అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే, ఇన్ఫెక్షన్-కారణమైన సూక్ష్మక్రిమి పెరుగుదలకు కారణమైన తెమ్మతో కూడిన గోడలు, తివాచీలు, కర్టెన్‌లను పరిశీలించి వాటిని శుభ్రపరుచుకోవాలి.
*. అనారోగ్య వ్యక్తులతో, ముఖ్యంగా శరీర ద్రవాలతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటాన్ని నివారించాలి. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఇన్ఫెక్షన్ కలిగించే జెర్మ్స్ వ్యాప్తిని తగ్గించడానికి కలుషితమైన ప్రదేశాలు, వస్తువులను శుభ్రం చేయాలి…ఇవన్నీ తూచ తప్పక ఫాలో అయితే పిల్లలను వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడవచ్చు..