NTV Telugu Site icon

Monsoon Health Tips: వర్షాకాలంలో వీటి జోలికి అస్సలు వెళ్లకండి..వెళితే దబిడిదిబిడే..

Berries Blackberries Blueberries

Berries Blackberries Blueberries

వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడి వేడిగా తినాలని అందరు అనుకుంటారు.. ముఖ్యంగా స్పైసీగా తీసుకోవాలని అనుకుంటారు.. అయితే, వర్షాకాలం ఆనందాన్నే కాదు.. రోగాలనూ వెంట తీసుకొస్తుంది. ఈ సీజన్‌లో అనారోగ్యాలు, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం తేమ ఎక్కువగా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా, వైరస్‌ల పెరుగుదలకు అనువుగా ఉండే కాలం. ఇది మనం తీసుకునే ఆహార పదార్థాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. తేమ పెరగడం వల్ల, రోజూ తినే పండ్లు, కూరగాయలపైనా.. బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది, జీర్ణ సమస్యలు ఎక్కువవుతాయి.. అందుకే ఈ వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ..

వంకాయలు బర్నింగ్ సెన్సేషన్‌, గ్యాస్ సమస్యను కూడా పెంచుతాయి, కాబట్టి వర్షాకాలంలో దీనిని తక్కువగా తినండి. వర్షాకాలంలో వంకాయలో కీటకాలు వేగంగా వృద్ధి చెందుతాయి. పొరపాటున మీరు వంకాయలతో పాటు ఈ కీటకాలను తింటే.. మీకు వాంతులు, దురద, అలెర్జీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. వంకాయలో ఆల్కలాయిడ్ ఉంటుంది.. ఇది శరీరానికి హానీ కలిగిస్తుంది..

అరటిపండ్లను ఏ సీజన్‌లోనైనా తినవచ్చు, కానీ మీరు అరటిపండ్లను సాయంత్రం, రాత్రి పూట, ఖాళీ కడుపుతో తింటే మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వర్షాకాలంలో అజీర్ణం, దగ్గు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట అరటిపండ్లను తినకపోవడమే మంచిది. ఇది శరీరంలో కఫా దోషాన్ని తీవ్రం చేస్తుంది. శ్లేష్మం పెంచుతుంది. దీని కారణంగా శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ.. అందుకే ఈ సీజన్ లో ఉదయం పూట మాత్రమే తీసుకోవాలి..

వర్షాకాలం స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్‌, బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలలో ఫంగస్‌ గ్రోత్‌ ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన బెర్రీలు తింటే జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి..

కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ స్రౌట్స్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే, వర్షాకాలంలో తక్కువగా తీసుకుంటేనే మంచిది. ఈ కూరగాయలలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంటుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది..

వర్షాలకు ఆకు కూరలు తినేముందు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి..అందులో పాలకూర, బచ్చలికూర వంటి ఆకు కూరలు తినే ముందు జాగ్రత్త వహించాలి. అధిక తేమ కారణంగా.. ఈ ఆకులపై బ్యాక్టీరియా వృద్ధి ఎక్కువగా ఉంటుంది. వీటిని సరిగ్గా శుభ్రం చేయకుండా తీసుకుంటే.. జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.. వేడిగా, లైట్ గా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.