Site icon NTV Telugu

Migraine : చలికాలంలో వచ్చే మైగ్రేన్‌ సమస్యకు చెక్ పెట్టండిలా..

migraine

migraine

మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో రకాల కొత్త అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. అందులో చలికాలంలో అయితే అసలు చెప్పనక్కర్లేదు.. అయితే ఈ కాలంలో మైగ్రెన్ తలనొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. చలి తీవ్రతకు తల నొప్పి కూడా ఎక్కువగా వస్తుంది.. ఒత్తిడి కారణం తలనొప్పి కూడా పెరుగుతుంది..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజీ జీవనశైలిలో ఒత్తిడి ప్రశాంతత లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మైగ్రేన్ తలనొప్పి అంటే కొంతమందికి తలకు ఒక సైడ్ వస్తుంది.. ఆ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది.. కొంతమందికి రెండు వైపులా తల నొప్పి కూడా వస్తుంది..

ఈ తలనొప్పి ఒక్కసారి వచ్చిందంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి అనేది పురుషుల్లో కన్నా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తలనొప్పి వస్తే రెండు గంటల నుండి మూడు రోజుల వరకు ఉండవచ్చు. ఈ తలనొప్పికి చెక్ పెట్టాలి అంటే బెల్లం అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు..

గోరువెచ్చని ఆవుపాలల్లో కొద్ది బెల్లం కలుపుకొని తాగాలి.. తాగుతూ ఉంటే మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో అల్లం కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు అల్లం రసంలో నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.. తలనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది… నిద్రలేమి సమస్యలు కూడా తగ్గిపోతుంది.. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు బెల్లం పాలు లేదా అల్లం నిమ్మరసం మిశ్రమం తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.. ఈ చిట్కాలు పాటిస్తే తలనొప్పి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version