NTV Telugu Site icon

Lip Stick Side Effects : లిప్ స్టిక్ ను వాడుతున్నారా? ప్రాణాలు పోయినట్లే..

Lipstick (2)

Lipstick (2)

అందానికి నిర్వచనం ఆడవాళ్లు.. ఆడవాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అద్ధం ఉంటుంది..అందంగా కనిపించాలని ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అమ్మాయిలు మాత్రమే కాదు దాదాపు మహిళలు అందరు కూడా అందంపై మోజు కలిగి ఉంటారు. ఆడవారంటేనే అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందాన్ని పెంచుకునేందుకు, ఉన్న అందాన్ని మరింత అందంగా చూపించుకునేందుకు ఆడవారు అనవసరమైన కెమికల్స్ తో కూడిన క్రీమ్స్ ని వాడుతూ ఉంటారు. అవి వెంటనే ఫలితం కనిపించకుండా చాలా సంవత్సరాల తర్వాత అయినా కూడా చర్మం పొడి బారి పోవడం లేదా మరేదైనా చర్మ సమస్యలు రావడం జరుగుతుంది.. ఇటీవల క్యాన్సర్ కూడా వస్తుంది..

పెదాలను మరింత ఆకర్షనీయంగా చెయ్యడం కోసం lip స్టిక్ వాడుతున్నారు.. ఎక్కువ శాతం ఆడవారు నాసిరకం లిప్‌స్టిక్‌ వాడుతున్నారు. దాని వల్ల అత్యంత ప్రమాదం ను వారు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నారని సదరు సంస్థ పేర్కొంది..కేవలం పెదాలకు మాత్రమే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా నాసిరకం లిప్‌స్టిక్‌ వల్ల కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. లిప్‌స్టిక్‌ లో ఎక్కువగా లెడ్ కెమికల్ ఉపయోగిస్తున్నారు. దాని వల్ల నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతే కాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..లైంగిక సమస్యలను కలిగిస్తుంది..

పునరుత్పత్తి వ్యవస్థపై కూడా నాసిరకపు లిప్‌స్టిక్‌ ప్రభావం చూపుతుందని, శరీరం ఎదుగుదలపై కూడా ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఖరీదైన లిప్‌స్టిక్‌ తో పోలిస్తే.. మామూలు లిప్‌స్టిక్‌ లో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటున్నాయని చెబుతున్నారు.. షైనింగ్ ఎక్కువగా ఉండేందుకు అధిక కెమికల్స్ ను చిన్న కంపెనీల వారు వాడుతారని, అందుకే ప్రముఖ కంపెనీలు తయారు చేసే ఖరీదైన లిప్‌స్టిక్‌ వాడితే పరవాలేదు కానీ.. చిన్న చిన్న షాపుల్లో చీప్ గా దొరికే లిప్‌స్టిక్‌ వల్ల ప్రాణాలకే ప్రమాదం.. పలు రకాల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. సో అదండి వాడితే మంచిదే వాడటం బెస్ట్ కదా.. అందుకే ఖరీదైన లిప్స్టిక్ లను వాడండి..

Show comments