NTV Telugu Site icon

Lifestyle : భార్యాభర్తల మధ్య జరిగే రొమాన్స్ గురించి ఎవ్వరికి చెప్పకండి.. ఎందుకంటే?

Lifestyle (2)

Lifestyle (2)

భార్యభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా ముద్దు ముచ్చట్లు ఉంటే ఆ గొడవలు మాయం అవుతాయి.. అయితే కొందరు తమ బంధంలో జరిగే ప్రతి విషయాలను సన్నిహితులతో పంచుకోవాలని అనుకుంటారు.. అది యమ డేంజర్ అని నిపుణులు అంటున్నారు..కుటుంబసభ్యులకు చెప్పలేని విషయాలు కూడా వారితో పంచుకుంటాం. కొంత మంది భార్యాభర్తల సంబంధం గురించి కూడా చెప్పుకుంటారు. ఇది ఏమాత్రం సరికాదని రిలేషన్‌షిప్‌ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఎంత ప్రాణ స్నేహుతులు అయినా.. వారితో కూడా పరిమితికి మించి అన్ని విషయాలు చెప్పకూడదని సూచిస్తున్నారు.. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

దంపతులు మధ్య ఎన్నో విషయాలు ఉంటాయి. భార్యాభర్తలన్నాక గొడవలు, అలకలు, కలహాలు చాలా సాధారణం.అవే సరదా..ముద్దూ ముచ్చట ఎలాగూ ఉంటాయి. కొందరు స్నేహితులే కదా అని వారితో అన్ని పంచుకుంటారు. ఆలూమగల మధ్య జరిగే అన్ని విషయాలు చెప్పేస్తుంటారు. బహుమతులు ఇచ్చినా, సర్‌ప్రైజ్‌ లు ఇచ్చినా.. చిన్న చిన్న గొడవలు అయినా వారికి చెబుతుంటారు. ఇది చాలా తప్పని అంటున్నారు రిలేషన్‌షిప్‌ ఎక్స్‌పర్ట్స్‌. భార్యాభర్తల మధ్య విషయాలను ఎవరితోనూ చెప్పకూడదని, వాటిని కేవలం ఇద్దరి మధ్యే ఉంచుకోవాలని అంటున్నారు..

చిన్న చిన్న విషయాలు అయితే ఓకే గానీ పర్సనల్ విషయాలను అస్సలు చెప్పకూడదు.. మరీ ముఖ్యంగా శృంగారం గురించి.. శృంగారం అంటే ఆలుమగలకు మాత్రమే సంబంధించిన అంశం. దీని గురించి ఎవరికీ చెప్పకూడదు. సెక్స్ అంటే ఇద్దరి జీవితాల్లో అత్యంత సున్నితమైనది. శృంగార సమస్యలు వచ్చినా వాటిని నాలుగ్గోడల మధ్య మీరిద్దరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి.. ఇలాంటి అస్సలు షేర్ చేసుకోకూడదు.. మీరు చెప్పారని తెలిస్తే అస్సలు ఊరుకోదు.. మళ్లీ అనవసరంగా గొడవలు వస్తాయి గుర్తుంచుకోండి.. ఏది ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి.. ఇలాంటి విషయాలు పొరపాటున బయటకు వెళితే బంధాలు విడిపోతాయి కూడా..

Show comments