ఈరోజుల్లో దంపతుల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది.. కొన్ని జంటలు పెళ్లి తర్వాత కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు..డబ్బులు సంపాదించాలనే కోరికతో బందాలను కూడా మర్చిపోతారు.. దాంతో బంధాలు విడిపోతున్నాయి.. మనసు విప్పి మాట్లాడుకోవాలి. దీనికి సమయమే ఉండటం లేదు. దంపతులకు ఏకాంతంగా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండటం లేదు. ఫలితంగా బంధాలు తెగిపోతున్నాయి.. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగితేనే మంచి సంబంధం ఉంటుంది.. ఈరోజుల్లో ఇలాంటి బంధాలు లేవనే చెప్పాలి..
నమ్మకం అనేది లేదు.. ఒకరంటే మరొకరికి ప్రేమ లేదు.. ఫలితంగా ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహంగా ఉంటోంది. బాధల్లో కూడా ఇద్దరు సరిగా ఉండటం లేదు. ఎవరి పనులు వారికే తీరడం లేదు. అందుకే అప్యాయతలు కానరావడం లేదు. ఫలితంగా అనారోగ్యాలకు గురైనప్పుడు కూడా సేవలు చేయడానికి సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరికి మధ్య ఎలాంటి వాత్సల్యం ఉండటం లేదు..దానివల్ల బంధం విడిపోతుంది.. ఇకపోతే కలిసి అనే మాట ఇక్కడ వినిపించడం లేదు..ఇద్దరు కలిసి బయటకు వెళ్లే సందర్బాలు కూడా ఉండటం లేదు.
కనీసం రెండు మూడు నెలలకోసారైనా విహార యాత్రకు వెళితే ఎంతో ప్రేమ చిగురిస్తుంది. కష్టసుఖాలు తెలుస్తాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. మనం చేసే ఉద్యోగం కన్నా భార్య ముఖ్యం అనుకుంటే ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా భార్యతో సమయం గడిపితే ఎంతో ప్రేమ పుడుతుంది.. ఈరోజుల్లో ఎక్కువ మంది దంపతుల్లో ప్రేమ ఉండటం లేదు. సమయం చిక్కడం లేదు. ఉన్న సమయంలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ఫలితంగా ఆలుమగల మధ్య అడ్డుగోడలు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో దంపతులు సమయం కల్పించుకుని జీవిత భాగస్వామిని సంతోషపెట్టాల్సిన సమయం కేటాయించుకోవాలి..అప్పుడే కలతలు రాకుండా ఉంటాయి..
