ప్రతి వ్యక్తి తమ చర్మం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అందు కోసం ప్రజలు అనేక రకాల చికిత్సలు తీసుకుంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి రకరకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ చాలాసార్లు ఆశించిన ఫలితాలు రావు. తినే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఎక్కువగా చర్మ సంబంధింత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే.. మీ చర్మం యవ్వనంగా కనిపించాలంటే కొన్ని మంచి ఆహారాలను తినడం మంచిది.
ఇదిలా ఉంటే.. వేసవి కాలం వచ్చిందంటే చర్మం ఎక్కువగా దెబ్బ తింటుంది. అలాంటప్పుడు.. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వయసు రాకముందే వృద్ధాప్యం కనపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారి ముఖంలో గీతలు, ముడతలు మరియు మచ్చలు కనిపిస్తాయి. చర్మం యవ్వనంగా ఉండాలంటే ఏయే ఆహారాలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.
బెర్రీలు
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు బెర్రీలలో పుష్కలంగా లభిస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ తినడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో వేగవంతమైన మార్పులను నెమ్మదిస్తాయి. దీనితో పాటు.. బెర్రీలు ఆక్సీకరణ ఒత్తిడిని తొలగించడంలో సహాయపడతాయి.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్‌లో బాదం, వాల్‌నట్, జీడిపప్పు, వాల్‌నట్‌లు, గుమ్మడికాయ గింజలు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా.. చర్మానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా పుష్కలంగా లభిస్తాయి.
కొవ్వు చేప
నాన్ వెజ్ ఫుడ్ ఇష్టపడే వారు తమ చర్మాన్ని కాపాడుకోవడానికి ఫ్యాటీ ఫిష్ ను డైట్ లో చేర్చుకోవచ్చు. చర్మంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
గ్రీన్ టీ
మీరు గ్రీన్ టీతో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే క్యాటెచిన్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
