అధిక బరువు సమస్య అనేది ఈరోజుల్లో కామన్.. అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తార.. కొందరు రకరకాల ముందులను కూడా వాడుతారు.. అయిన ప్రయోజనం లేదని ఫీల్ అవుతారు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాలు.. మన వంట గదిలో దొరికే వాటితోనే సులువుగా బరువును తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తొందరగా బరువు తగ్గాలంటే ఈ గింజలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ గింజలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అవిసె గింజలు.. జీవక్రియ రేటు అలాగే జీర్ణ క్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి కేలరీలను వేగంగా బర్న్ చేయడానికి ఇది పని చేస్తుంది. అవిసె గింజలు ఫైబర్ ను పుష్కలంగా అందిస్తుంది.. ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగి ఉండేలా చేస్తుంది.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. జీలకర్ర జీర్ణక్రియను సహాయపడి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. జీరా నీరు జీర్ణ క్రియకు సహాయపడుతుంది..
కరివేపాకు.. కరివేపాకు కూరలో ఉంటే తీసి పడేస్తాము.. కానీ దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదలరు.. జీలకర్ర కూడా జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.. ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. కొవ్వు కరిగే ప్రక్రియను జీలకర్ర వేగవంతం చేస్తుంది. ఇది అధిక ఆకలిని కంట్రోల్ చేస్తుంది.కరివేపాకును నమలడం లేదా తినడం వల్ల శరీరం నుండి వచ్చే హానికారకమైన విషాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే దానిని శరీరం నుండి తొలగిస్తుంది.. ఈ మూడింటిని కలిపి తీసుకుంటే అధిక బరువును సులువుగా తగ్గవచ్చు..
ముందుగా కరివేపాలను తీసుకొని నీటిలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.. ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా అవిసె గింజలు, నాలుగైదు రెబ్బల కరివేపాకులు తీసుకుని పాత్రలో బాగా వేయించాలి. పొడి పొడిగా అయిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ప్రతి రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ పొడిని కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోయి బరువు త్వరగా తగ్గుతారు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
