NTV Telugu Site icon

Vastu Tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఇవ్వరికీ ఇవ్వొద్దు..

Vasthu

Vasthu

భారతీయుల్లో ఒకరితో మరొకరు బాధలు, సంతోషాలు పంచుకునే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే వస్తువులను కూడా పంచుకుంటాం. అయితే.. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇది మీ పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వస్తువులు ఇతరులతో షేర్ చేసుకోకూడదో తెలుసుకుందాం…

సూది అస్సలు తీసుకోవద్దు..
ఇరుగు పొరుగు నుంచి ఎక్కువగా చేతులు మారేది సూది. మన దగ్గర లేకపోతే వెంటనే వేరే వాళ్ళ దగ్గరకి వెళ్ళి సూది తెచ్చుకుంటారు. కానీ అలా చేయకూడదు. సూదిని తీసుకోవడం వల్ల జీవితంలో కష్టాలు ఎదురవుతాయని నమ్మిక. కలహాలకు కారణం అవుతుందని అభిప్రాయం. అందుకే అవసరమైతే సూది కొనుగోలు చేసుకోవాలి కానీ వేరొకరి దగ్గర నుంచి ఉచితంగా తీసుకోకూడదు. సాయంత్రం పూట బట్టలు కుట్టడం చేయకూడదు అంటారు.

ఉప్పుతో శనికి సంబంధం…
ఉప్పుతో శనికి సంబంధం ఉందని నమ్ముతారు. ఉప్పు ఎవరికి అరువుగా ఇవ్వకూడదు. ఫ్రీగా ఎవరు ఇచ్చినా తీసుకోకూడదు. ఇళ్ల పక్కన ఉండే వాళ్ళు చాలా మంది ఉప్పు కాస్త పెట్టమని లేదంటే అరువుగా ఇవ్వమని వస్తూనే ఉండటం చూస్తూ ఉంటారు. కానీ ఉప్పు దానం చేస్తే శని ప్రభావం మీమీద పడుతుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి.

ఖర్చీఫ్ పంచుకోవడం వల్ల రోగాలు..
చేతి రుమాలు పొరపాటున కూడా ఎవరి వేరే వాళ్ళది తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా వెంటనే తిరిగి ఇచ్చేయాలి. ఖర్చిఫ్ ఉచితంగా తీసుకోవడం వల్ల ఇద్దరి మధ్య సంబంధాల చెడిపోయే అవకాశం ఉంది. స్నేహితుల సంబంధం చెడిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. ఇది ఆరోగ్య పరంగా కూడా మంచిది కాదు. వారి చెమట తుడుచుకున్న రుమాలు మీరు ఉపయోగించడం వల్ల క్రిములు చేరి రోగాల బారిన పడతారు.

ఇనుముకి కూడా శనితో సంబంధం…
ఇనుముకి శనితో నేరుగా సంబంధం ఉంటుంది. అందుకే పాత ఇనుప వస్తువులు, పనికిరాని వాటిని ఇంట్లో ఉంచుకోకూడదని చెప్తారు. అవి నెగటివ్ ఎనర్జీకి ఆవాసంగా మారతాయి. ఇనుము ఇంకొకరి దగ్గర నుంచి ఉచితంగా తీసుకున్నా లేదంటే అరువుగా తెచ్చినా కూడా సమస్యలు వస్తాయి. అది మాత్రమే కాదు శనివారం రోజు ఇనుము వస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు.

శంఖం లక్ష్మీదేవికి ప్రియమైనది..
శంఖం బహుమతిగా ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి, విష్ణువు ఇద్దరికీ శంఖం ప్రియమైనది. లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే ఇంట్లో శంఖాన్ని పొరపాటున కూడా ఎవరికి ఇవ్వొద్దు. బహుమతిగా కూడా ఇవ్వకూడదు. దీని వల్ల ధన నష్టం భరించాల్సి వస్తుంది. శంఖం ఇవ్వడం అంటే మీ ఇంటి లక్ష్మిని ఎదుటి వారికి ఇచ్చినట్టు అవుతుంది.

నూనె.. నూనె ఇతరుల నుంచి తీసుకోవడం వల్ల శని ప్రభావం నేరుగా పడుతుంది. ఎందుకంటే నూనెకి శనితో సంబంధం కలిగి ఉంటుంది. దీన్ని బదులు తీసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.

 

 

Show comments