NTV Telugu Site icon

చలికాలం చర్మ సంరక్షణ ఎలా?

కార్తీకమాసం మొదలు కావడంతో చలి తీవ్రత పెరుగుతోంది. జనవరి వరకూ చలిగాలులు వీస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువగా పగటి ఉష్ణోగ్రత నమోదు అవుతుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి పులి పంజా విసురుతూ వుంటుంది. చలికాలంలో ప్రధానంగా మనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు.

చలికాలంలో కొన్ని సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు చర్మం పొడిబారుతుంది. శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమౌతుంటాయి. ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉండటం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతింటుంటుంది. చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్ వాడాలి. మార్కెట్‌లో అందుబాటులో ఉండే వాటిల్లో నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను మాత్రమే వినియోగించుకోవాలి. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలి. దీని వల్ల చర్మంలో తేమ శాతం పెరుగుతుంది. చర్మం పొడిబారడానికి తేమ తగ్గడం కూడా ఒక కారణంగా చెబుతారు చర్మవ్యాధి నిపుణులు.

కోడిగుడ్లు, దానిమ్మ, జామపండ్లు, సపోటా, యాపిల్, సీతాఫలాలు వంటి సీజనల్ పండ్లను అధికంగా తీసుకోవాలి. అవన్నీ కూడా చర్మ సంరక్షణకి ఉపయోగపడతాయి. పడుకునే మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ ధరించడం వల్ల మడమల పగుళ్లను నివారించుకోవాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఉష్ణోగ్రతలను కాపాడతాయి. ఒమెగా 3, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం వంటివి అధిక మోతాదులో ఉన్న కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. ముక్కు, చెవులకు చలిగాలి తగలకుండా మంకీ క్యాప్ లాంటివి వాడాలి. చిన్నపిల్లలకు జలుబు, జ్వరాలు వచ్చేది ఇప్పుడే. పిల్లల్ని చలిగాలుల్లో తిరగకుండా చూడాలి.