Site icon NTV Telugu

Breakup Tips: బ్రేకప్ నుంచి బయటపడాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

Breakup

Breakup

ప్రేమ అనే మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నప్పుడు ఇద్దరి మధ్యలో గడిచిన క్షణాలకు లెక్క తేలదు. ఆ సమయంలో ఎటు చూసినా ప్రేమే కనిపిస్తుంది. మరి ప్రేమలో ఆనందం ఎలా ఉందో.. విఫలమైతే విషాదమూ అలానే ఉంది. ఒకప్పుడు ప్రేమ విఫలమయితే దేవదాసులు అయిపోతారనే నానుడి మనలో ఉంది.. మరిప్పుడు కాలంతో పాటు ఆ అభిప్రాయమూ మారుతుంది.. ఇప్పటి ప్రేమలు చిన్న పొరపొచ్చాలు వచ్చినా బ్రేకప్‌ల వరకూ వెళిపోతున్నాయి.

READ MORE: Telangana Cabinet: 15కు చేరిన తెలంగాణ మంత్రి వర్గం.. మరో మూడు ఖాళీలు

గుణపాఠంగా తీసుకోవాలి..
ముందుగా మొదటి నియమం ఏంటంటే.. అప్పటిదాకా ఏది జరిగినా మన మంచికే జరిగిందని నమ్మాలి. ఉదాహరణకు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన బంధం నిజమైనది అయితే.. అది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. ఒకవేళ అది బ్రేకప్‌కు దారి తీస్తే.. ఇద్దరి వైపు తప్పులు ఉన్నట్లే. ఆ బంధాన్ని నిలబెట్టాలని చూసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏది జరిగినా, దానిని ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మీరు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి. జీవితంలో ముందుకు వెళ్ళాలి.

READ MORE: Devendra Fadnavis: రాహుల్‌ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్‌ ఎటాక్

బ్రేకప్ తర్వాత ఇది చాలామంది చేసే పొరపాటు. విడిపోయిన అనంతరం మన గురించి మనం పట్టించుకోవడం కూడా మానేస్తాం. ఇది చాలా తప్పు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. రిలేషన్‌షిప్‌ కంటే ముందు మీరు ఎలా ఉండేవారో గుర్తుతెచ్చుకోండి. మీ కలల్ని సహకారం చేసుకోవడంలో.. లక్ష్యాలను చేధించడంలో సమయాన్ని కేటాయించండి. తద్వారా మీ మనస్సుకు కాస్తా ప్రశాంతత కలగడమే కాకుండా.. మీలో కొత్త ఉత్సాహం వస్తుంది.

READ MORE: Devendra Fadnavis: రాహుల్‌ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్‌ ఎటాక్

ఒంటరితనం వీడనాడండీ..
సాధారణంగా ఒంటరిగా ఉంటే ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. మనస్సు కూడా కంట్రోల్‌గా ఉండదు. అలాంటిది బ్రేకప్ టైంలో ఒంటరిగా ఉంటే ఇంకేమైనా ఉందా.! పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. చనిపోవాలనే చెడు ఆలోచనలు కూడా వస్తాయి. అందుకే ఎక్కువగా ఫ్రెండ్స్‌, కుటుంబసభ్యులు మధ్య ఉండండి. అంతేకాకుండా ఎప్పుడూ ఏదొక పని చేస్తూ మైండ్‌ను చెడు ఆలోచనల నుంచి డైవర్ట్ చేయండి. బ్రేకప్ తర్వాత సెకండ్ ఛాన్స్ ఇచ్చేందుకు చాలామంది సంకోచిస్తారు. మొదటి వ్యక్తితో పోలుస్తూ భయపడుతుంటారు. లేదా కొంతమంది తమకంటూ కొన్ని రూల్స్ సిద్దం చేసుకుంటారు. గుర్తుంచుకోండి, అందరూ ఒకేలా ఉండరు. ముందుగానే ఒక డెసిషన్‌కు రావడం కరెక్ట్ కాదు. అలాగే మీరు పెట్టుకున్న నియమాలు ఎవరిపైనా విధించడం మంచిది కాదు. రెండో ఛాన్స్ ఇవ్వండి. వేరొకరిని సంతోషపెట్టే విషయంలో మిమ్మల్ని మీరు గుర్తుతెచ్చుకోండి. స్ట్రాంగ్‌గా ముందుకు అడుగు వేయండి.

Exit mobile version