Chia seeds: మనం ఇదివరకు చియా సీడ్స్ సంబంధించి అనేక ప్రయోజనాల గురించి చదవడం లేదా విని ఉంటాము. కానీ ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. అదేంటంటే.. వాటిని ఎలా తినకూడదో తెలుసుకుందాము. చియా సీడ్స్ హైడ్రోఫిలిక్. అంటే, అవి నీటిని గ్రహించి పరిమాణంలో పెరుగుతాయి. మీరు వాటిని పొడిగా తిని ఆ తర్వాత నీరు తాగితే అవి మధ్యలో వాపు పెరిగి మీ గొంతులో లేదా ఆహార వాహికలో అడ్డుపడవచ్చు.
Dogs: వీధి కుక్కలు ఎందుకు వెంటపడతాయి..? తప్పించుకోవాలంటే ఏం చేయాలి?
ఈ మధ్య ఓ వ్యక్తి ఇలా పొడి చియా సీడ్స్ మింగి నీరు తాగిన తర్వాత తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆయనకి అడ్డంకిని తొలగించడానికి ఎండోస్కోపీ కూడా చేయవలసి వచ్చింది. అందుకే.. చియా సీడ్స్ ని రాత్రంతా లేదా కనీసం ఒక గంట పాటు నానబెట్టడం చాలా ముఖ్యం. అది జెల్ లాంటి స్థితికి వచ్చిన తర్వాత అవి జీర్ణం కావడానికి సులభంగా ఉంటాయి. అలా తినడం ద్వారా చాలా సురక్షితం కూడా. చియా సీడ్స్ ఖచ్చితంగా ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. కానీ, సరైన విధంగా తయారు చేసినప్పుడు మాత్రమే. ఆరోగ్యకరమైన ఎంపికల్లో కూడా ఈ మాత్రం కొంచెం జాగ్రత్త చాలా అవసరం.
AP Govt : ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు – రాష్ట్రవ్యాప్తంగా 12మంది జిల్లా కలెక్టర్లు మార్పు
