శరీరంలో ఏర్పడే మలిన పదార్ధాలను బయటకు పంపే సహజ వ్యవస్థ మన శరీరంలో ఉంది. విషపదార్థాలను శరీరం నుంచి విసర్జించాడాన్ని డేటాక్సిఫికేషన్ అంటారు. అయితే అత్యుత్సాహంతో తినే అనవసరం పదార్థాల వల్ల అనేక విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. వాటిని విసర్జించాలి అంటే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఉపవాసం వల్ల సులువుగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలలో లభిస్తుంది. అల్కహాల్ రసాయనిక పదార్థాలు, ఫాస్ట్‌పుడ్స్, అధిక మసాలలతో ఉన్న ఆహారము ద్వారా ఏర్పడే ఇతర విషపూరిత వాయువులు, విష పదార్థాలు ఏవైనా కావచ్చు.
ఇవి శరీరంలో పేరుకు పోతే సహజ శరీర విసర్జక వ్యవస్థ పని చాలా కష్టం అవుతుంది. అందువల్ల జీవన చర్యలు మందగిస్తాయి. ఫలితంగా జీర్ణ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, విసర్జక అవయవం ముల పని తీరు అస్తవ్యస్తం అవుతుంది. చర్మం మీద పొక్కులు, తట్టు, కీళ్ల నొప్పులు, జీర్ణము వంటివి అలసటను కలగచేస్తాయి. విసర్జక అవయవాలైన కాలేయం, మూత్రపిండాలు, పేగుల పని భారము ఎక్కువై దెబ్బతింటాయి. ఇతర ముఖ్య అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, మెదడు కూడా దీని ప్రభావానికి లోనే ఇబ్బంది పెట్టె అనేక వ్యాధులు కలుగుతాయి.
ఎలా తప్పించుకోవాలి..?
ఈ వ్యవస్థకు మూలకారణమైన పదార్ధాలను తినకూడదు. సహజసిద్ధమైన సులువుగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మితముగా తీసుకోవాలి. ఉపవాసము చేసి పండ్లు, తాజా పండ్ల రసాలు త్రాగడం వలన ఒకటి రెండు రోజుల్లో విషపదార్థాలను బయటకు పంపి చేయవచ్చు.
తినకూడని పదార్థాలు..
మాంసము, పాల ఉత్పత్తులు, అల్కాహాల్, ప్రాసెస్ చేసిన తీపి పదార్ధములు, వేపుళ్ళు, ఊరగాయలు, అనవసరముగా చీటికి మాటికి మందులు వాడ రాదు.
తినవలసిన పదార్థములు..
తాజా పండ్లు, కూరలు, ఆకుకూరలు వల్ల మూలికలతో చేసిన పానీయాలు, బాదం, వాల్‌నట్, జీడిపప్పు, పొద్దుతిరుగుడు, గుమ్మడి విత్తనాలు, బ్రౌన్ రైస్, గోధుమ జొన్నలతో చేసిన ఆహార పదార్థాలతో పాటు ఎక్కువగా నీళ్లు తాగాలి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, సెలెనియమ్, వంటి విటమిన్‌లు తీసుకుంటూ ఉండాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, డయాబెటీస్, లోబీపీ, ఫుడ్ అలర్జీ ఉన్నవారు ఉపవాసము చేయకూడదు.